Bihar election results 2025: బిహార్ అసెబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితాలు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి వస్తున్నాయి. వార్ వన్‌సైడ్ అన్నట్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ గెలుపు సాధించే దిశగా పలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 190 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక మహాగట్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కీలక విషయం ఏమిటంటే.. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసులు తేజశ్వి యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ ఇద్దరూ పోటీలో వెనుకపడ్డారు.
సీఎం అభ్యర్థిగా..
ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాఘట్‌బంధన్ తరఫున బలమైన ప్రచారం చేసిన తేజశ్వి రెండో స్థానంలో ఉన్నప్పటికీ, తేడా కేవలం వెయ్యి ఓట్ల పరిధిలోనే ఉంది. ఇది తర్వాతి రౌండ్లలో మారే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేరువైపు, తేజ్‌ప్రతాప్ మాత్రం తన నియోజకవర్గంలో నాలుగో స్థానంలో ఉండడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్లా బలమైన ఆధిపత్యాన్ని పెంపొందించుకుంటున్నారు.
Also Read: నీతీశ్.. ఫిర్ ఏక్‌బార్..!
రాజకీయ అర్థాలు
తేజశ్వి యాదవ్ వ్యక్తిత్వం, యవతలో ప్రజాదరణ ఉన్నప్పటికీ, స్థానిక అభ్యర్ధులు, కూటమి లోపల వ్యతిరేక ధోరణి ప్రభావం చూపిన సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, బీజేపీ మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాలు గ్రామీణ ఓటర్లను ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఈ ఎన్నికల ఫలితాలు బీహార్ రాష్ట్ర రాజకీయ శక్తి సమీకరణాలను మరోసారి పునర్నిర్వచించే సూచనలు ఇస్తున్నాయి. లాలూ కుటుంబానికి ఇది కేవలం ఓటమి కాకుండా, వారసత్వ నాయకత్వంపై ప్రజాభిప్రాయం దిశను కూడా సూచించే దశగా చెప్పవచ్చు.