Homeఎంటర్టైన్మెంట్ETV Mallemala: డబ్బే కాదు...ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు

ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు

ETV Mallemala: ‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’ అని, ప్రస్తుతం మల్లెమాలలో ఎవరి పరిస్థితి అయినా ఇంతే. మల్లెమాల సంస్థ పై, ఆ సంస్థ అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పై వినిపిస్తున్న టాక్ ఇది. రేటింగ్ లో జబర్దస్త్ ఎప్పుడూ టాప్ లిస్టులోనే ఉంది. ఇదొక బూతు షో అని విమర్శలు వచ్చినా.. రికార్డ్ స్థాయిలో ఈ షో హిట్ అయ్యింది. కారణం.. ఈ షోలో నటించిన కమెడియన్లు. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి నవ్వించారు. షో కోసం వ్యక్తిగతంగానూ కామెడీ పాలు అయ్యారు. సుధీర్ లాంటి వ్యక్తులు అనవసరపు ఇమేజ్ లను సృష్టించుకుని ఇప్పటికీ ఆ ఇమేజ్ ల చట్రంలోనే నలిగిపోతున్నారు.

ETV Mallemala
ETV Mallemala

జబర్దస్త్ కోసం తాము ఇంత చేస్తున్నా.. తమను అంటరాని వారిగా చూడటం ఏ కమెడియన్ భరించలేకపోయాడు. మల్లెమాల సంస్థలో విలువలు లేవా ?, తమ సంస్థ కోసం అహర్నిశలు శ్రమించిన వారికీ కూడా ఆ సంస్థ మర్యాద చేయదా ?, ఒక్కటి మాత్రం నిజం.. మన కోసం కష్టపడే వారిని బాధ పెట్టడం మంచిది కాదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ప్రముఖ నిర్మాత, ఇలాంటి విషయాల్లో వార్తల్లో నిలవడం ఆయన గౌరవానికే మచ్చ. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరికీ సహాయం చేయరని కేవలం వ్యాపార దృక్కోణంతో ఆలోచిస్తారని ఆయన పై విమర్శలు ఉన్నాయి.

Also Read: Mallemala: మల్లెమాల పై తిరుగుబాటు ఆర్టిస్టుల ఆత్మగౌరవానికేనా ?

జబర్దస్త్ రామ్ ప్రసాద్ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి కనీసం మాట సాయం కూడా చేయలేదట. తన సంస్థలో పని చేసే కమెడియన్లు, నాగబాబు కలిసి రామ్ ప్రసాద్ ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం పెట్టే భోజనం కూడా దారుణంగా ఉంటుందని.. ఎన్నిసార్లు చెప్పినా.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి పట్టించుకోలేదు. మల్లెమాల భోజనం కంటే.. చర్లపల్లి జైల్లోనే భోజనం బాగుంటుందని అక్కడ పని చేసే వ్యక్తులే చెబుతున్నారు.

ETV Mallemala
jabardasth

జబర్దస్త్ అనేది కేవలం ఒక కార్యక్రమమే కావొచ్చు. ‘మీరు మాకు ఉపయోగపడుతున్నారు, కాబట్టి మీకు నాలుగు రాళ్లు పడేస్తున్నాం అనే ధోరణిలో ముందుకు పోవడం ఏ సంస్థ ఎదుగుదలకు మంచిది కాదు. డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే అని మల్లెమాల ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకపోతే మల్లెమాల నుంచి ఇంకా వలసలు వస్తూనే ఉంటాయి. ఈ వలసలు కారణంగా ఇప్పటికే జబర్దస్త్ షో రేటింగ్ 3కి పడిపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే.. ఇక షో ఎత్తేయాల్సి వస్తోంది. కాబట్టి.. నేటికీ అయినా మేల్కొంటే.. మల్లెమాలకు మేలు జరుగుతుంది.

Also Read:Koffee with Karan 7: ‘ఊ అంటావా’లో సమంత కంటే.. టిప్ టాప్ లో కత్రినా బెటర్ డ్యాన్సర్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version