Bhatti Vikramarka Padayatra: పాదయాత్ర.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లు అధికారానికి దూరమై.. ^è తికిలబడిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా 2003లో అప్పటి సీఎల్పీ నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో నడక మొదలు పెట్టారు. చేవెళ్ల నుంచి మొదలు పెట్టిన వైఎస్సార్ యాత్ర.. ఊరు, వాడ, పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రజల ఆకట్టుకునేలా సాగింది. సుమారు 3,500 కిలోమీటర్లు ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా సాగిన యాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. తాజాగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర కూడా అచ్చం వైఎస్సార్ యాత్రను తలపిస్తోంది. కాంగ్రెస్ నేతలకు భరోసా ఇస్తోంది.
రెండు దశాబ్దాల తర్వాత..
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మరో యాత్రకుడు బయల్దేరాడు. నాడు వైఎస్సార్ ఏ హోదాలో యాత్ర చేశాడు. ప్రస్తుతం భట్టి విక్రమార్క కూడా అదే హోదాలో ఉన్నారు. సీఎల్పీ నేతగా వైఎస్సార్ ప్రజాప్రస్థానం యాత్ర చేయగా, పీపుల్స్ మార్చ్ పేరుతో నేడు భట్టి యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే భట్టి యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిచింది. ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 16న ప్రారంభమైన యాత్ర ఈనెల 25 నాటికి 101వ రోజుకు చేరుకోనుంది. భట్టియాత్ర ఆసాంతం.. ప్రజలతో మమేకమవుతూ సాగుతోంది.
భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. కేంద్ర…రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరరకు జోడో యాత్ర నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో భట్టి విక్రమార్క తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలు వచ్చినా..యాత్ర కొనసాగింపులో వెనుకడుగు వేయలేదు. పార్టీ ప్రముఖులు.. సీనియర్లు.. కేడర్ భట్టి యాత్రకు అండగా నిలిచింది.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా..
భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. పార్టీని తెలంగాణలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రతో పార్టీ తెలంగాణ కేడర్‌లో జోష్ పెరుగుతోంది. ఇదే సమయంలో అధిష్టానం పెద్దలను ఆకర్షిస్తోంది. ఇతర రాష్ట్రాల నేతలు యాత్రను ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీ రాష్ట్రశాఖ నుంచి అందుతున్న నివేదికలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం భట్టి చొరవను ప్రశంసిస్తోంది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కూడా ఆరా తీశారు.
దక్షిణాది రాష్ట్రాలే కీలకం..
2024లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ఈ సారి దక్షిణాది రాష్ట్రాలే కీలకం కానున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని కాంగ్రెస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఇటీవలే అధికారంలోకి వచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ క్యాడర్‌లో ఉత్సాహం వచ్చిది. దీంతో అధిష్టానం ఇప్పుడు తెలంగాణపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భట్టి యాత్ర కూడా ఆ దిశగా సాగుతుండడంతో ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. తెలంగాణలో 19, కర్ణాటకలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నిల్లో 40 ఎంపీ స్థానాలు ఈ రెండు రాష్ట్రాల నుంచే గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అన్నివర్గాలను కలుపుకుపోతూ..
భట్టి పాదయాత్రను ప్రణాళికా బద్ధంగా కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా అన్నివర్గాల ప్రజల మధ్యకు వెళ్తున్నారు. గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలతో భట్టి మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు ఓదార్పు ఇస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. కేంద్రంలో ప్రధానిగా రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మంచిని ప్రజల మధ్య విశ్లేషించారు. భట్టికి అన్నివర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందన పార్టీ అధినాయకత్వం వరకు వెళ్లింది. తెలంగాణలో పార్టీ కోసం భట్టి చేస్తున్న పాదయాత్ర పైన స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి థాక్రే నుంచి ఆరా తీశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిన నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు.. కేడర్ లో సరికొత్త జోష్ నెలకొందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాత్ర ముగింపు సభకు రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bhatti vikramarka padayatra will he bring glory to the congress party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com