Bengaluru: మామూలు తాగుడు కాదు అది. ఒక రకంగా మద్యం లో స్నానం చేశారు. విచ్చలవిడిగా తాగిన తర్వాత తూలిపోయారు. అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. ఒంటిమీద సోయి లేదు. ఇంటికి వెళ్లాలనే కోరిక లేదు. ఇంకా తాగాలని తాపత్రయం మాత్రం ఉంది. ఆ స్థితిలో వారిని చూసిన పోలీసులు.. తట్టుకోలేక వాహనాలలో ఇంటి వద్ద దిగబెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
ఒక మనిషి మద్యం తాగితే.. దానిని తట్టుకునే స్థాయి కొంతవరకే ఉంటుంది. అలాకాకుండా ఇష్టానుసారంగా మద్యం తాగితే శరీరం ఏమాత్రం సహకరించదు. కొంతలో కొంత మగవాళ్ళు మద్యం తాగితే తట్టుకుంటారు గాని.. ఆడవాళ్లకు ఆ సామర్ధ్యం ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళ శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది. బెంగళూరులో డిసెంబర్ 31 నాడు వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన ఈ ప్రాంతంలో డిసెంబర్ 31 నాడు ఆడవాళ్లు రెచ్చిపోయారు. మగవాళ్ళకు మించి మద్యం తాగారు. తాగడం మాత్రమే కాదు డ్యాన్సులు వేశారు. పరిమితికి మించి మద్యం తాగిన కొంతమంది ఆడవాళ్లు రోడ్లమీద పడిపోయారు. కనీసం అడుగు తీసి అడుగు వేసే సోయి కూడా వారిలో లేకుండా పోయింది. అంతేకాదు ఎదుటి వ్యక్తుల మీద దాడులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక పోలీసులు వారిని వాహనాలలో ఇళ్ల వద్ద దిగబెట్టారు.
బెంగళూరులో గతంలో ఇలా పరిస్థితి ఉండేది కాదు. నమ్మ బెంగళూరు కాస్త ఇప్పుడు మద్య బెంగళూరుగా మారిపోతుంది. ఐటీ కంపెనీలు విపరీతంగా ఉన్న ప్రాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు. తాగడాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు. కేవలం డిసెంబర్ 31 మాత్రమే కాదు, ప్రతిరోజు పబ్ లలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ తాగుతున్నారు. అమ్మాయిలు తాగి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరు సంస్కృతిని కాస్త ఇలా నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు నెటిజన్లు.
” విపరీతంగా మద్యం తాగి.. ఒంటిమీద సోయి కోల్పోయారు. అంత పీకలదాకా మద్యం తాగాల్సిన అవసరం ఏముంది. ఆ స్థాయిలో తాగి ఇళ్లకు వెళ్తే కుటుంబ సభ్యులు ఏమీ అనరా? సోషల్ మీడియాలో వారి వీడియోలు సర్కులేట్ అవుతుంటే వ్యక్తిగత పరువు ఏమవుతుందో ఆలోచించలేరా? చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు ఇలా తాగి పడిపోవడం నిజంగా విలువల పతనానికి నిదర్శనం అని” నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివారిని రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉంచాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
Fun Without Responsibility Is a Curse: Bengaluru Deserves Better Than Drunken Street Chaos
This is not the culture of Bengaluru. Do not ruin the image of Namma Bengaluru by turning our roads into places of chaos in the name of parties and New Year celebrations. Seeing youths… pic.twitter.com/OIS5XkgP0S
— Karnataka Portfolio (@karnatakaportf) January 1, 2026