Pawan Kalyan Case : ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార వైసీపీకి కంట్లో నలుసులా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రజా సమస్యలపై పవన్ చేస్తున్న పోరాటం.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తీరు వైసీపీకి నచ్చడం లేదు. కానీ పవన్‌కు అవే బలంగా మారుతున్నాయి. దీంతో జనసేనాని బలపడుతున్న విషయం పసిగట్టిన అధికార పార్టీ అడుగడుగునా ఆటంకం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా పవన్‌పై మరో సిల్లీ కేసు పెట్టింది.
పవన్‌పై కుట్ర ఆరోపణలు..
పవన్‌పై వైసీపీ సర్కార్ కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పవన్‌పై ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై పెట్టిన కేసు.. పోలీసులను ప్రజల్లో మరంత చులకన చేస్తోంది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమిక వివరాలు లేవు. శివకుమార్ అనే వ్యక్తి.. ఫిర్యాదు చేశాడు కానీ.. మిగతా వివరాల్లేవు. కనీసం ఫోన్ నెంబర్ లేదు. ఐదు రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశాడో కారణం లేదు. అసలు ఆ ఫిర్యాదులో యాక్సిడెంట్ చేసినట్లుగా లేదు. తనకు తానే పడ్డానని ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ చూసిన తర్వాత .. మీడియా వర్గాలకూ కామెడీ అనిపించింది.
కక్షపూరితంగానే..
పవన్‌పై పెట్టిన కేసు చూస్తే.. కక్షతో కళ్లు మూసుకుపోయి.. ఏదో ఒకటి చేద్దామని నవ్వుల పాలవుతున్నారని వారికీ అర్థం అయింది. పోలీసులకూ తాము చేసిన తప్పేంటో తెలిసిపోయినట్లుగా ఉంది. అటు పోలీసుల, ఇటు ఫిర్యాదు దారుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు ఎదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం ఇస్తారు. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎఫ్‌ఐఆర్ రెండు రోజుల తర్వాత లీక్ కావడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు.
అడ్రస్ లేని ఫిర్యాదు దారు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన శివకుమార్ అనే వ్యక్తి అసలు కనిపించడం లేదు. తెనాలి మోరిస్‌పేటలో శివకుమార్ ఎవరో తెలుసుకోల్కేపోతున్నారు. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు వ్యవహరం రాజకీయ కోణంలో జరిగిందని ఎవరికైనా అర్థం అవుతుంది. పోలీసులు అడ్డుకోవడం వల్లనే పవన్ తన వాహనం పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ, అలానే ఇప్పటం వరకు వెళ్లారు. ఆ రోజే పోలీసులు రెచ్చగోట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడ పవన్‌పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం, నమోదు అయిన కేసు వివరాలను కూడా బయటపెట్టేందుకు రెండు రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తి రాజకీయ కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. ఈ కేసులో పవన్‌ను ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో కానీ.. తనతో పాటు పోలీసుల్నీ నవ్వులపాలు చేసిందని మాత్రం కామెంట్స్ వినపిస్తున్నాయి.