BCCI Governance India: భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటివరకు స్వాతంత్ర వ్యవస్థగా కొనసాగుతోంది. ఎంతోమంది క్రీడాకారులకు ఉజ్వలమైన కెరియర్ అందించింది. క్రికెట్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ మైదానాలు నిర్మించి.. మన దేశంలో క్రికెట్ అనేది అత్యంత ప్రాచుర్యమైన క్రీడగా అభివృద్ధి చెందడానికి దోహదపడింది. మాజీ ఆటగాళ్లకు పింఛన్ సౌకర్యంతో పాటు ఇతర సౌలభ్యాలు కూడా కల్పిస్తోంది. భవిష్యత్తు కాలంలో క్రికెట్ విస్తరణకు మరింతగా కృషి చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంపై ఏనాడు కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధారపడలేదు. పైగా మనదేశంలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తోంది. ఇటీవల ఒలింపిక్స్ క్రీడల కోసం వెళ్లిన ప్లేయర్లకు తన వంతుగా ఆర్థిక సహకారం కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి అందించింది.
Also Read: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు
బుధవారం కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పాలన బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ క్రీడా బోర్డు నుంచి అధికారికంగా గుర్తింపు పొందాల్సి ఉంటుంది.. 2028 లో లాస్ ఏంజిల్స్ లో నిర్వహించే ఒలంపిక్స్ లో క్రికెట్ కూడా చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు గా పేరుపొందిన భారత క్రికెట్ నియంత్రణ మండలి లో పారదర్శకత, ఇతర సంస్కరణలు, జవాబు దారీ తనానికి తీసుకురావడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.. “భారత క్రికెట్ నియత్రణ మండలి ఆర్థికంగా స్వతంత్రంగానే ఉంది. అయితే జాతీయ క్రీడా సమాఖ్యగా ఇది గుర్తింపు పొందాల్సి ఉంది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలిని తీసుకొచ్చారు. దీనివల్ల ఇతర గుర్తింపు పొందిన సమాఖ్యల మాదిరిగానే భారత క్రికెట్ నియంత్రణ మండలికి నియమాలు వర్తిస్తాయి. పరిపాలన ప్రమాణాలు.. వివాదాలను పరిష్కరించే యంత్రంగాల పరిధిలోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి వస్తుంది.. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు దేశ చట్టాలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ క్రీడల ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రిబ్యునల్ ఎన్నికల నుంచి మొదలు పెడితే వివాదాల పరిష్కారం వరకు అన్నింటిని పర్యవేక్షిస్తుంది. జాతీయ క్రీడా పాలన బిల్లు వల్ల జాతీయ క్రీడా సమాఖ్యల మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండదు. వీటికి కేంద్ర ప్రభుత్వం సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది.
Also Read: పదేళ్ల బాలుడి దేశభక్తి స్ఫూర్తి.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాహసం!
చోటు చేసుకునే మార్పులు ఇవే
జాతీయ క్రీడా ట్రిబ్యునల్
జాతీయ క్రీడా ట్రిబ్యునల్ అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కార్యవర్గం ఎంపిక నుంచి మొదలుపెడితే అంతర్గత ఎన్నికల వరకు ఏవైనా వివాదాలు చోటు చేసుకుంటే ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది.
వయోపరిమితి సడలింపు
వివిధ క్రీడా సమాఖ్యలో కార్యనిర్వాహక సభ్యుల గరిష్ట వయో పరిమితి 75 సంవత్సరాల వరకు పెరుగుతుంది. గతంలో ఇది 70 సంవత్సరాల వరకు ఉండేది. తద్వారా ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (70) మరో కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగడానికి అవకాశం కల్పిస్తుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త చట్టం ద్వారా జాతీయ క్రీడ మండలి పర్యవేక్షణ పరిధికి లోబడి ఉంటుంది.. ఈ సంస్థ భారత టికెట్ నియంత్రణ మండలి లో ఆర్థిక జవాబుదారితనాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. లాస్ ఏంజిల్స్ లో ఒలింపిక్స్ లో క్రికెట్ ను తొలిసారిగా ఆడిస్తున్న నేపథ్యంలో.. ఈ బిల్లు చట్టంగా మారడం ఒక అనివార్యత లాగా కనిపిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు.