https://oktelugu.com/

దివీ-అవినాష్ రోమాన్స్? ప్రేమలోకంలో ‘బిగ్ బాస్’ హౌస్?

బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్-4’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 105రోజులపాటు సాగే ఈ షో ఇప్పటికే 40రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు ఎలిమినేట్ అవగా.. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ కూడా కంటెస్టులకు రకరకాల టాస్కులు ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. Also Read: వర్మ హీరోయిన్లు.. లైన్లో పడుతున్నారా? ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కలర్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ లో ట్రయాంగిల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 11:57 AM IST
    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులను ‘బిగ్ బాస్-4’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 105రోజులపాటు సాగే ఈ షో ఇప్పటికే 40రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు ఎలిమినేట్ అవగా.. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ కూడా కంటెస్టులకు రకరకాల టాస్కులు ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

    Also Read: వర్మ హీరోయిన్లు.. లైన్లో పడుతున్నారా?

    ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కలర్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. అభిజిత్.. మొనాల్.. అఖిల్ మధ్య నడుస్తున్న ప్రేమాయణం ఆకట్టుకుంటోంది. వీరిమధ్య గొడవలు పలు ట్వీస్టులను తలపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారంతా వయస్సులో ఉన్నవారే కావడంతో వారంతా ఓ తోడును కోరుకుంటున్నట్లు కన్పిస్తోంది.

    బిగ్ బాస్ హౌస్ లో పెళ్లికాని వారే ఎక్కువగా ఉండటంతో వీరిమధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది. అవినాష్.. దివీ.. అరియానా మధ్య కూడా రోమాంటిక్ ట్రాక్ నడుస్తున్నట్లు కన్పిస్తోంది. అవినాస్ వీరిద్దరిని ఆకట్టుకునేందుకు చేసే విన్యాసాలు బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా అవినాష్-దివీ మధ్య ఓ రోమాంటిక్ సంభాషణ్ జరిగింది.

    40వ రోజు ఉదయమే అరియానా.. అవినాష్ బెడ్స్ పై తిష్టవేసి పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న దివీ అనివాష్ తో మాట కలిపింది. అవినాష్ ఫేస్ రీడింగ్ చెబుతానంటూ దివీ సంభాషణ కొనసాగించింది. నీ ప్లస్ ఏంటంటే.. నీ జోక్స్ తో అందరిని ఆకర్షిస్తావు.. నాకు ఇచ్చిన ఓపో టైటిల్ నీకు సూట్ అవుతుంది.. అందరూ నీ దగ్గరకు వచ్చి కూర్చోవడానికి ఇష్టపడుతారు. నీ జోక్స్ చాలా ఎంటటైనింగ్ గా ఉంటాయని చెప్పింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ అలా.. ఎన్టీఆర్ ఎలా?

    ఇక నీ మైనస్ ఏంటంటే టాస్క్ ఆడేటప్పుడు నీవు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి అందరినీ హార్ట్ చేస్తావని చెప్పింది. దీంతో అవినాష్ టాస్కులో కి మారిపోవడం నా తప్పు ఎలా అవుతుందని చెబుతాడు. అంతేకాకుండా నీవు చాలా అందంగా ఉంటావని.. పట్టుకుంటే జారిపోతావంటూ దివీని ఉద్దేశించి అనినాష్ కామెంట్ చేస్తాడు.

    వీరిద్దరి మధ్య రోమాంటిక్ సంభాషణ చూస్తే అవినాష్ లైన్లో దివీ పడిపోయిందా? అన్న సందేహం కలుగుతోంది. కంటెస్టుల మధ్య రోమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా వస్తుండటంతో ప్రేక్షకులకు టీవీలకు అతుక్కుపోతున్నారు.