https://oktelugu.com/

Bandla Ganesh Pawan Kalyan: బండ్లన్నా.. పవన్ కల్యాణ్ ను వదిలేయ్ ప్లీజ్..

Bandla Ganesh Pawan Kalyan: ఏదైనా ఉండాల్సినంత ఉంటేనే అర్థం. అది అతిగా మారితే కష్టమే. ఇది దేనికైనా వర్తిస్తుంది. అభిమానముంటే మనసులో ఉంచుకోవాలి కానీ బయట పెట్టాలని ప్రయత్నించడం కూడా ఒక్కోసారి వివాదాలకు దారితీస్తుంది. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ముద్దుగా దేవర అని పిలుచుకునే గణేష్ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులతో అభిమానుల్లో ఆగ్రహం కలిగేలా చేస్తున్నాడు. అభిమానం కాస్త […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2022 / 12:18 PM IST
    Follow us on

    Bandla Ganesh Pawan Kalyan: ఏదైనా ఉండాల్సినంత ఉంటేనే అర్థం. అది అతిగా మారితే కష్టమే. ఇది దేనికైనా వర్తిస్తుంది. అభిమానముంటే మనసులో ఉంచుకోవాలి కానీ బయట పెట్టాలని ప్రయత్నించడం కూడా ఒక్కోసారి వివాదాలకు దారితీస్తుంది. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ముద్దుగా దేవర అని పిలుచుకునే గణేష్ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులతో అభిమానుల్లో ఆగ్రహం కలిగేలా చేస్తున్నాడు. అభిమానం కాస్త వెర్రితలలు వేస్తుండటంతో సహజంగా అందరిలో కోపం వస్తుంది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అతడిలోని పిచ్చి ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

    Bandla Ganesh, Pawan Kalyan

    దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు నీకో దండం రా బాబూ మా అన్నను వదిలేయ్. ఇలాంటి పోస్టులు పెడుతూ ప్రేక్షకులను పక్కదారి పట్టించకు. ఇక చాలు నీ వ్యక్తిగత విషయాలు బహిరంగంగా రుద్దొద్దు అని కామెంట్లు పెట్టడం మామూలైపోయింది. పవన్ కల్యాణ్ అంటే అందరికి అభిమానమే. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. కానీ ఇలా బహిరంగంగా తోచిన విధంగా చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. అందుకు బండ్ల గణేష్.. జర జాగ్రత్త అంటూ పలువురు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

    ఓ సినీ వేడుకలో అడివి శేషు, డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ఈ ఫొటోకు పవన్ కల్యాణ్ చేతులు కట్టుకుని కూర్చున్న ఫొటోలు జత చేసి నమస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కామెంట్ పెట్టడంతో ప్రేక్షకుల్లో ఆగ్రహం కలిగింది. అది నమస్కారం కాదు సంస్కారం ముందు నువ్వు భాష నేర్చుకో అని కౌంటర్ ఇస్తున్నారు. పైగా ఎక్కడివో ఫొటోలు తెచ్చి ఇలా చేయడం నీ స్థాయికి తగదని హితవు పలుకుతున్నారు. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇలా సామాజిక మాధ్యమాల్లో పెడుతూ పవన్ కల్యాణ్ పరువు తీయకు అని కామెంట్లు పెడుతున్నారు.

    Pawan Kalyan

    ఎవరికి నచ్చినట్లు వారుంటారు. ఎందుకు అందరిని బద్నాం చేయాలని చూస్తావ్? ఇలాంటి పనికి రాని పోస్టులు పెడితే నీకు కూడా సంస్కారం లేదని అనుకుంటారని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నీకో దండం గణేషన్నా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇలా పరువు పోయే విధంగా ప్రవర్తించకు. ఈ పోస్టు డిలీట్ చేయండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మీద ప్రేమ ఉంటే మనసులో పెట్టుకో కానీ ఇలా పరువు పోగొట్టుకునే పని చేయకు ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు.

    Tags