https://oktelugu.com/

శ్రీవారి నిధులను ఏపీ సర్కార్ వాడుకోనుందా?

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తిరుపతి పేరుగాంచింది. ఎన్నో ఏళ్లుగా శ్రీ మహావిష్ణువు భక్తులతో పూజలందుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వస్తుంటారు. శ్రీవారికి మొక్కుల రూపంలో భక్తులు నగదు.. బంగారం, తదితర కానుకలను అందించడం ఆనవాయితీగా వస్తుంది. వీటి లెక్కంటన్నింటిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చూసుకుంటోంది. Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….? భక్తులు ఇచ్చే కానుకలను టీటీడీపీ భక్తుల సదుపాయాలు.. ఆలయాల మరమ్మతులు.. పూజా తదితర సామాగ్రి.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 12:43 PM IST
    Follow us on

    దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తిరుపతి పేరుగాంచింది. ఎన్నో ఏళ్లుగా శ్రీ మహావిష్ణువు భక్తులతో పూజలందుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వస్తుంటారు. శ్రీవారికి మొక్కుల రూపంలో భక్తులు నగదు.. బంగారం, తదితర కానుకలను అందించడం ఆనవాయితీగా వస్తుంది. వీటి లెక్కంటన్నింటిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చూసుకుంటోంది.

    Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?

    భక్తులు ఇచ్చే కానుకలను టీటీడీపీ భక్తుల సదుపాయాలు.. ఆలయాల మరమ్మతులు.. పూజా తదితర సామాగ్రి.. విద్యాసంస్థల అభివృద్ధికి.. సేవా కార్యక్రమాలను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రతీరోజు శ్రీవారి ఆదాయం 2నుంచి 3కోట్లు వస్తుంటోంది. ఇక పండుగ రోజుల్లో ఇంకొంచెం ఎక్కువగా ఆదాయం వస్తుంటుంది. శ్రీవారి నిధులన్నింటిని టీటీడీ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది. వీటిపై వచ్చే వడ్డీ ద్వారా టీటీడీ సిబ్బందికి జీతాలు, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది.

    ఇటీవల కాలంలో దేశంలో లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో టీటీడీకి ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ పై ఇచ్చే వడ్డీ కూడా ప్రతీయేటా తగ్గుతూ పోతోంది. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ 3నుంచి 4శాతం మాత్రమే వస్తోంది. అదే బాండ్ల ద్వారా అయితే 7శాతం వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో శ్రీవారి నిధులను ప్రభుత్వ బాండ్ల రూపంలోకి మార్చేసి ఆదాయం పొందాలని టీటీడీ భావిస్తోంది. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా దీని వెనుక కూడా రాజకీయ కోణం ఉందని టాక్ విన్పిస్తోంది.

    ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. బ్యాంకుల్లోనూ సర్కారు అప్పుపుట్టడం లేదు. ఆర్బీఐ ఇచ్చే రుణ పరిమితి కూడా దాటిందనే సమాచారం. కేంద్రం నుంచి నిధులు కూడా అరకొరగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి నిధులను బాండ్లోకి మార్చనుంది. దీని ద్వారా బాండ్ల రూపంలో టీటీడీకి వడ్డీ ఎక్కువగా వస్తుందని అలాగే బాండ్లను షూరిటీ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి రుణ సదుపాయం లభించనుందని సర్కార్ భావిస్తుంది.

    Also Read: ఏపీ భూకుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌‌లకు నివాళి: ‘ద వైర్’ ఎడిట‌ర్ నిర‌స‌న

    ఇటీవల టీటీడీ నిధులను రాజకీయ సభల కోసం వినియోగించారనే ఆరోపణలు.. హిందూ ఆలయాలపై వరుస దాడులు.. చోరి సంఘటన నేపథ్యంలో టీటీడీ పాలకవర్గం ఎలా నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి నిధులను ప్రభుత్వ బాండ్లలోకి మార్చాలని టీటీడీ భావిస్తే ఏపీలో మరో వివాదం చెలరేగడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ-ఏపీ సర్కార్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!