Munugodu Bandi Sanjay : మునుగోడు ఉప ఎన్నికకు ఒకరోజు ముందు అర్ధరాత్రి అగ్గి రాజేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడుకు సంబంధం లేని ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా ఆ నియోజకవర్గం వదిలేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉండి ప్రలోభాలకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆర్వో కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా బండి సంజయ్ హైదరాబాద్ నుంచి మునుగోడుకు కదిలారు. మునుగోడుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు రామోజీ ఫిలింసిటీ వద్ద అడ్డుకొని బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.

పోలీసులు మునుగోడులో టీఆర్ఎస్ నేతలకు సహకరిస్తూ బీజేపీ నేతలను కొడుతున్నారని.. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మునుగోడుకు వెళ్లే ప్రయత్నం చేసిన బండి సంజయ్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై భైఠాయించిన బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలను ఆపి పోలీసులు దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.మునుగోడులో స్థానికేతర మంత్రులు ఎమ్మెల్యేలు తిష్టవేసి అరాచకాలకు పాల్పడుతుంటే ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నిలదీశారు. పోలీసులతో బండి ఘర్షణ పడ్డారు. వాగ్వాదానికి దిగారు.
విజయవాడ-హైదరాబాద్ రహదారిపై బండి సంజయ్ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. మునుగోడు నుంచి బీజేపీ నేతలందరినీ పంపించేదాకా రోడ్డుపై కదిలేది లేదని బండి సంజయ్ ధర్నా చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.
స్థానిక అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్ నుత రలించారు. పోలీస్ స్టేషన్ లోనూ బండి సంజయ్ ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోనే బండిని నిర్బంధించారు పోలీసులు.
Live : https://t.co/pQIRQ24x8k
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2022