Bandi Sanjay: చిన్నారులపై అత్యాచారాల దమనకాండ కొనసాగుతోంది. అభం శుభం తెలియని పసిపాపలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. దీంతో ముక్కుపచ్చలారని వారిని తుదముట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో నిత్యం దాడులు కొనసాగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయం లేకపోవగా నిందితులను రక్షించే పనిలో పడటం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పక్కా నరక ప్రపంచంలో మునిగిపోతున్నామా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

ఇటీవల సిరిసిల్లలో ఓ చిన్నారిపై టీఆర్ఎస్ నాయకుడు లైంగిక దాడి చేయడం చర్చనీయాంశం అవుతోంది. బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాల్సిన పార్టీ కూడా ముఖం చాటేయడం గమనార్హం. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటనలో కూడా చిన్నారిని హత్య చేసిన నిందితుడిపై కూడా అధికార పార్టీ నిర్వాకం వివాదాస్పదమైంది. దీంతో రాష్ర్టంలో అసలు ఏం జరుగుతోందనే సంశయం అందరిలో వస్తోంది.
రాష్ర్టంలో మహిళలపై దాడులు పెరుగుతున్నా అధికార పార్టీ పట్టించుకోవడం లేదు. బాధితుల పక్షాన నిలవడం లేదు. ఫలితంగా న్యాయం కోసం వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. సిరిసిల్లలో కూడా చిన్నారిపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం కనీసం కేసు కూడా నమోదు చేయనివ్వకుండా అడ్డు పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రిని సందర్శించి చిన్నారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.
మెరుగైన వైద్యం అందించి చిన్నారి కోలుకునేలా చూడాలని చెప్పారు. టీఆర్ఎస్ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రాష్ర్టంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రజలు భీతిల్లి పోతున్నారు. దీనిపై ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం.