spot_img
Homeజాతీయ వార్తలుBandi Sanjay: బండి సంజయ్ కు చిక్కులు.. మొన్న పాదయాత్ర, ఇప్పుడు నిరుద్యోగ దీక్షలు..

Bandi Sanjay: బండి సంజయ్ కు చిక్కులు.. మొన్న పాదయాత్ర, ఇప్పుడు నిరుద్యోగ దీక్షలు..

Bandi Sanjay:  గత ఎంపీ ఎన్నికలు బండి సంజయ్ కు బాగా కలిసి వచ్చాయి. 2018లో తెలంగాణలో జరిగిన ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బండి సంజయ్.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాస్త దూకుడు పెంచడంతో బీజేపీ పెద్దలు ఆయనకు బీజేపీ స్టేట్ చీఫ్ పదవిని కట్టబెట్టారు.
Bandi Sanjay
Bandi Sanjay
అప్పటి నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు అధికార పార్టీ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలా దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మాట శైలితో ఓట్లను రాబట్టగలిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయనకు  పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read: KTR vs Revanth Reddy: కేటీఆర్ ఎక్కడున్నారు? నిజంగానే దుబాయ్ కు వెళ్లారా?

హుజూరాబాద్ ఉపఎన్నిక కారణంగా తొలివిడత పాదయాత్రను నిలిపివేశారు. అనంతరం ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర గురించి ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం ఆయన రెండో విడత పాదయాత్రకు సంబంధించిన ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ హైకమాండ్ నుంచి ఆయనకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని టాక్. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్, కేసీఆర్ అవినీతి వంటి విషయాలను ప్రస్తావించిన అమిత్ షా.. బండి సంజయ్ పాదయాత్ర గురించి మాత్రం ఎలాంటి మాట చెప్పలేదు.
పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతి కోసం బండి సంజయ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు తాజాగా నిరుద్యోగ దీక్షను ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒమిక్రాన్ విషయంలో ప్రధాని ఇచ్చిన సందేశంతో ఆ దీక్షలకు సైతం ప్రస్తుతం బ్రేక్ పడింది. హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. దీంతో బండి సంజయ్ కు షాక్ తగిలినట్టయింది. ఇలా బండి సంజయ్ చేపట్టిన రెండు కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కానీ, బండికి ఇలా అవాంతరాలు ఎదురవుతుండటం పట్ల మరో వర్గం వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు టాక్.
Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version