కారు దిగి “బండె”క్కమంటున్న సంజయ్..

  తెలంగాణ బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ హవా నడుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో.. బీజేపీ శ్రేణుల్లో ఆయనకు కొత్త క్రేజ్ వచ్చింది. హైకమాండ్ వద్ద కూడా పలుకుబడి పెరిగింది. తనకు వచ్చిన ఈ పొలిటికల్ ఇమేజ్‌ను.. లాంగ్ డ్రైవ్ మైలేజ్ గా మర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. Also Read: జంప్ జిలానీలతో టీఆర్ఎస్ షేక్ కానుందా? కరీంనగర్ పై ఫోకస్.. బండి సంజయ్ బీజేపీలో దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ.. బలమైన నేతగా ఎదగలేకపోయారు. పలుమార్లు ఎన్నికల్లో […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 4:56 pm
Follow us on

 


తెలంగాణ బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ హవా నడుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో.. బీజేపీ శ్రేణుల్లో ఆయనకు కొత్త క్రేజ్ వచ్చింది. హైకమాండ్ వద్ద కూడా పలుకుబడి పెరిగింది. తనకు వచ్చిన ఈ పొలిటికల్ ఇమేజ్‌ను.. లాంగ్ డ్రైవ్ మైలేజ్ గా మర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: జంప్ జిలానీలతో టీఆర్ఎస్ షేక్ కానుందా?

కరీంనగర్ పై ఫోకస్..
బండి సంజయ్ బీజేపీలో దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ.. బలమైన నేతగా ఎదగలేకపోయారు. పలుమార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచారు సంజయ్. అయితే.. అదంతా గాలివాటం గెలుపు అనే ప్రచారం సాగింది. దీంతో.. తన గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Also Read: విమానం దిగిన కారు.. ఫ్లైట్ ఎక్కిన బండి.. పిక్చర్ క్లియర్!

టీఆర్ఎస్ నేతలకు గాలం..?
కరీంనగర్లో తన బలం పెంచుకునేందుకు.. టీఆర్ఎస్ నుంచి చేరికల్ని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్ టౌన్‌లో టీఆర్ఎస్ స్థానిక నేతగా గుర్తింపు ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆయన భార్య ఇప్పటికీ కార్పొరేటర్‌గా ఉన్నారు. మరికొంత మంది టీఆర్ఎస్ నేతలపైనా బండి వల వేస్తున్నట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

బలమైన నేతగా..
కరీంనగర్‌లో బీజేపీకి పట్టు పెరిగేలా చేయగలిగితే బలమైన నేతగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో పలు చోట్ల గెలిచి సొంత స్థానంలో ఓడిపోతే విలువ ఉండదు. అందుకే.. తన బలం పెంచుకునే పనిలో పడ్డారట సంజయ్. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..?