KCR Bandi Sanjay:కొన్ని సెటైర్లు అద్భుతంగా పేలుతాయి. సాధారణంగా రాజకీయాల్లో సెటైర్లను ఆటంబాంబులా పేల్చడంలో సీఎం కేసీఆర్ ను మించిన వ్యక్తి మరొకరు లేరు. ఆయన రూటే సపరేట్.. ఆయన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందుంటాడు. ఆయన కేసీఆర్ కు సరితూగేలా మాటల మంటలు రేపుతారు. అయితే వీరిద్దరికి పోటీగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చేశారు. ఆయన అణుబాంబుల వలే వదులుతున్న మాటలు ఇప్పుడు సంచలనమయ్యాయి.

కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా.. ఆయనను ఇరికించేలా బండి సంజయ్ పేల్చుతున్న ఈ డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ ప్రచారంలో ఉన్న బండి సంజయ్ వాడిన డైలాగులకు బీజేపీ శ్రేణులు, ప్రజలు ఈలలు గోలలతో అల్లరి చేసేశారు.
ఫాపం కేసీఆర్ ను టీఆర్ఎస్ ప్లీనరీలో పండుగ చేసుకుంటుంటే ఆ ఆనందం కూడా లేకుండా బండి సంజయ్ చేసేశారు.. టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అబద్దాలాడే వారికి అవార్డు ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
ఇక హుజూరాబాద్ లో పర్యటించడానికి ప్రచారం చేయడానికి కేసీఆర్ కు ముఖం లేదని.. దానికి కారణాలు కూడా చెప్పిన బండి సంజయ్ డైలాగులు వైరల్ అయ్యాయి. గతంలో తన ముఖం చూసి ఓటేస్తారని చెప్పిన కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లడం లేదని, అందుకే ఇక్కడకు రాకుండా సభ పెట్టుకోనీయకుండా ఈసీ అడ్డుకుంటోందంటూ రాజ్యాంగబద్దమైన ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారని బండి సంజయ్ సెటైర్ల వర్షం కురిపించారు.
మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో వేస్తే కేసీఆరే పంచులు వేయాలి.. పడితే ప్రతిపక్షాలే పడాలి అన్న చందంగా ఉన్న రాజకీయం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. బండి సంజయ్ అంతకు మించి అనేలా పంచులు పేల్చుతూ కేసీఆర్ ను ఇరుకునపెట్టేస్తున్నారు.