https://oktelugu.com/

డాక్టర్ల రాజీనామాలపై కేసీఆర్ ను నిలదీసిన బండి సంజయ్

కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమకు కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం లేదని అంటూ తెలంగాణలో కొందరు ప్రభుత్వ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం పట్ల కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం దేశ ప్రజలు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కీలకమైన ముందుండి నడిపిస్తున్న యోధులైన ప్రభుత్వ వైద్యులు కొందరు తెలంగాణలో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తుండటం […]

Written By: , Updated On : April 6, 2020 / 05:47 PM IST
Follow us on


కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమకు కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం లేదని అంటూ తెలంగాణలో కొందరు ప్రభుత్వ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం పట్ల కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తం దేశ ప్రజలు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కీలకమైన ముందుండి నడిపిస్తున్న యోధులైన ప్రభుత్వ వైద్యులు కొందరు తెలంగాణలో ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తుండటం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేసీర్ ప్రభుత్వం వారికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించక పోవడం వల్లననే ఈ విధంగా జరుగుతూ ఉండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అత్యవసర సమయంలో సేవలు అందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ఇలా డాక్టర్లకు కిట్స్ అందించకుండా తత్సరం చేస్తే ప్రభుత్వానికి అప్రత్తిష్ఠ పాలు అవుతుందని కేసీఆర్ ప్రభుత్వాన్ని సంజయ్ హెచ్చరించారు.

ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అంధించి వారికి మనో ధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణిలో అలసత్వం వహించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాధికాన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలాషన్ తో పాటు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కొందరు అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాకుతో కిట్స్ అందరికి అందించడం సాధ్యంకాదని చెప్పడం పట్ల విషయం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో వైద్యులకు కనీస సౌకర్యాలు అంధించకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో సేవలు అందిస్తున్న డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు.