Bandi Sanjay: కాదేదీ కవిత అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు.. కాదేదీ రాజకీయానికి అనర్హం అంటున్నాయి పొలిటికల్ పార్టీలు. చేయాలి అనుకుంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దది ఎలా చేయొచ్చు అని చూపిస్తున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు. ఇందుకు తాజాగా
కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య సీటు కోసం జరిగిన గొడవే ఉదాహరణ. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశం అయింది. గొడవపడ్డ వారిలో ఓ మహిళ భర్త ఎస్ఐ అయితే మరొకరు ముస్లిం మహిళ. ఆ గొడవలో ఎస్ఐ జోక్యం చేసుకోవడంతో అసలు కథ ప్రారంభమయింది.
ఎస్సై సస్పెన్ష్..
ఈ వివాదంలో తన భార్యతో గొడవ పడిన మైనార్టీ యువతిపై ఎస్సై దాడికి పాల్పడ్డాడని, ఆమెను జుట్టు పట్టుకుని బస్సు నుంచి కిందకు లాక్కొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్సైను పై అధికారులు సస్పెండ చేశారు.
తమ తప్పే లేదంటున్న ఎస్సై భార్య..
అయితే సస్పెండ్‌కు గురైన ఎస్సై అనిల్ భార్య సంధ్య వాదన మాత్రం మరోలా ఉంది. మైనార్టీ యువతినే తనను నోటికొచ్చినట్లు తిట్టడంతో పాటు కొట్టారని, తన భర్త ఆమెను కొట్టలేదని చెబుతోంది.
రంగంలోకి బీజేపీ..
జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేసిన వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఒత్తిడితో ఈ పని చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన అని అన్నారు. దీనికి వ్యతిరేకంగా శనివారం జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఎస్ఐ మాత్రం .. తన సస్పెన్షన్ గురించి పూర్తిగా డిపార్టుమెంట్ అంశమని.. ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధమేమిటని అంటున్నారు. తనను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన అంటున్నారు.
అయితే. బీజేపీ ఇక్కడ బాధితులు.. నిందితులు చూడటం లేదు. అక్కడ జరిగిన గొడవలు హిందువులు, ముస్లింలు ఉన్నారని చూస్తోంది. అందుకే కావాల్సిన రాజకీయం చేసేస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More