Group Exams In Urdu: తెలంగాణ ప్రభుత్వం ఈసారి పరీక్షల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన సంస్కరణలు కొన్ని అభ్యర్థులకు ఊరటనిస్తుండగా.. మరికొన్ని శరాఘాతంగా మారుతున్నాయి. గ్రూప్స్ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేసి అసలైన టాలెంట్ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే గొప్ప సంస్కరణ చేసింది. దీనిపై అభ్యర్థులందరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం రాజేసింది.
గ్రూప్ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేసి రాతపరీక్ష ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. తాజాగా హఠాత్తుగా మరో జీవో ఇచ్చి పెనుదుమారం రేపింది. దానిప్రకారం ఇప్పటివరకూ పరీక్ష పత్రాలు తెలుగు/ఇంగ్లీష్ లోనే ఉండేవి. ఇప్పుడు తాజాగా ఉత్తర్వులతో వాటిని ఉర్దూలోనూ రాసే అవకాశం కల్పించారు.
Also Read: KA Paul: కేఏ పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఆయనకు పుషింగ్ ఇచ్చే వారెవరు?
అయితే దీనిపై బీజేపీ మండిపడుతోంది. ఉర్దూ రాసే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారని.. వాళ్లకోసం ఆ మీడియా పెడితే వాళ్లే రాస్తారు..? వాళ్లే పేపర్లు దిద్దుకుంటారని.. దీని వల్ల ఉద్యోగాలు కూడా వాళ్లకే వస్తాయని.. మిగిలిన వాళ్లకు అన్యాయం జరుగుతుందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
తాజాగా బండి సంజయ్ సంచలన ఆరోపనలు చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఉర్దూలో పరీక్ష రాయడానికి అనుమతించడం ఉద్యోగాలన్నీ ఒక వర్గానికి కట్టబెట్టడమేనని బండి సంజయ్ ఆరోపించారు. ఇది టీఆర్ఎస్ మతతత్వవాదానికి అతిపెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా పోరాటానికి సిద్ధమైంది.
ఇక బీజేపీ పరీక్షలకు రాజకీయ రంగు పులమడంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే భారత పౌరులకు హక్కు ఉంటుందని అంటున్నారు.
ఇక ఉమ్మడి ఏపీలోనూ ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ పరీక్షలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా నిర్వహించడం లేదు. సో బీజేపీ వాదన కాస్త బలహీనంగా ఉన్నా కూడా ఆ వర్గం నుంచి చూస్తే ఇది బలంగానే కనిపిస్తోంది.
మొత్తానికి బీజేపీ నేతలు ఓ కొత్త కోణాన్ని వెలికి తీశారు. ఉర్దూలో పరీక్షలు రాస్తే నిజంగానే ఆ వర్గం వారికి మేలు జరుగుతుందని.. నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వాదన తెచ్చారు. ఇది లాజిక్ గానే కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వెనక్కి తగ్గుతుందా? అన్నది వేచిచూడాలి.
Also Read:Telangana BJP: అతడే బీజేపీ సీఎం క్యాండిడేట్.. తెలంగాణ బీజేపీలో మళ్లీ హీట్