Homeజాతీయ వార్తలుBalkampet Yellamma Temple: బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి ఆ పేరెలా వ‌చ్చింది.. గుడి ప్రాముఖ్య‌త ఏంటో...

Balkampet Yellamma Temple: బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి ఆ పేరెలా వ‌చ్చింది.. గుడి ప్రాముఖ్య‌త ఏంటో తెలుసా..?

Balkampet Yellamma Temple:  బ‌ల్కంపేట ఎల్లమ్మ‌.. ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్‌. మ‌న తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎల్ల‌మ‌, పోచ‌మ్మ ఆయ‌లాలు ఉన్నాయి. కానీ వాట‌న్నింటిలో కెల్లా ఈ ఎల్ల‌మ్మ దేవాల‌యం ఎప్ప‌టి నుంచో ప్ర‌ముఖంగా వెలుగొందుతోంది. అయితే ఈ ఆల‌యంలో ఎల్ల‌మ్మ ఎలా వెలిసింది, ఈ గుడి గొప్పతనం ఏంటనేది ఇప్పుడు మ‌నం చూద్దాం.

Balkampet Yellamma Temple
Balkampet Yellamma Temple

ప‌ర‌శురాముని త‌ల్లి రేణుకా దేవినే నేలి క‌లియుగంతో ఎల్ల‌మ్మ త‌ల్లిగా కొలుస్తున్నారు. బాలా త్రిపుర సుంద‌రిగా ఈ త‌ల్లికి పేరుంది. కాగా ఈ అమ్మ‌వారిని భ‌క్తులు బాలాంబికగా పిలుస్తుండేవారు. అదు రాను రాను బాలికాంబిగా.. ఈ త‌ల్లి కొలువైన ప్రాంతాన్ని బ‌ల్క‌మ్మ పేట‌గా పిలుస్తుండేవారు. కాలాను రీత్యా అదే నేడు బ‌ల్కంపేట‌గా మారింద‌ని చ‌రిత్ర చెబుతోంది.

Also Read: BJP Focus On Telangana: తెలంగాణ‌పై ఢిల్లీ నేత‌ల క‌న్ను.. ఏప్రిల్ లో మ‌రింత హీటెక్క‌నున్న రాజ‌కీయాలు

ప్ర‌స్తుతం స్వ‌యంభువు మూర్తి శిరస్సు వెనుక భాగాన ఉన్న బావి నుంచే వ‌స్తున్న నీటిని భ‌క్తులు తీర్థంగా భావిస్తుంటారు. ఈ నీటిని తాగితే స‌ర్వ‌రోగాల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కం ఉంది భ‌క్తుల‌లో. దాదాపు 700 ఏండ్ల క్రిత‌మే ఈ బావి ఉంద‌ని, ఆ స‌మ‌యంలో బావి నీటి మ‌ధ్య‌లో అమ్మ‌వారు ఉండేవార‌ని పురాణాలు చెబుతున్నాయి.

నీటి మ‌ధ్య‌న అమ్మ‌వారు ఉండ‌టంతో.. దూరం నుంచే అమ్మ వారిని ద‌ర్శించుకునే వార‌ని చరిత్ర చెబుతోంది. నిజాం కాలంలో రాజుగా ప‌నిచేసిన శివరాజ్ బహద్దూర్ హ‌యాంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ పున‌ర్ణిర్మించిన‌ప్పుడే పోచ‌మ్మ ఆల‌యాన్ని కూడా క‌ట్టిన‌ట్టు చెబుతున్నారు.

Balkampet Yellamma Temple
Balkampet Yellamma Temple

ఈ బావిలో ఎల్ల‌మ్మ త‌ల్లి ప‌ది అడుగుల లోతున శయనరూపంలో వెలిసినందున‌.. పై భాగంలోని మహామండపంలో అఖండజ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుందని పురాణాలు చెబ‌తున్నాయి. ఇక భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పించేందుకు ఈ ఆయ‌లం ప‌క్క‌నే అమ్మవారి రూపంతో విగ్రహాన్ని నిర్మించారు పుషప్గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతిస్వామివారు.

ఇక మంగ‌ళ‌వారం అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌స్తుంటారు. ఎందుకంటే ఈరోజు అమ్మ‌వారికి ప్రీతి. ప్ర‌తి ఏడు ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు అమ్మ‌వారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. ఇక ఆషాడ మాసం చివ‌రి ఆదివారం రోజున పెద్ద ఎత్తున బోనాలు స‌మ‌ర్పిస్తారు.

Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular