Balineni Srinivas Reddy : ఆ నలుగుర్ని టీడీపీలో చేర్చించింది బాలినేనా? జగన్ లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

పార్టీ నుంచి బాలినేని వెళ్లిపోయినా పర్వాలేదని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కార‌ణాలేవైనా వైసీపీలో బాలినేనికి బ్యాడ్ డేస్ మొద‌లైన‌ట్టు క‌నిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 6, 2023 10:44 am
Follow us on

Balineni Srinivas Reddy : వైసీపీలో మాజీ మంత్రి బాలినేనికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయా?  చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని వ్యవహరించిన తీరు తాజాగా బయటకు రావడంతో జగన్ కుతకుత ఉడికిపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే  బాలినేని విషయంలో లైట్ తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే బాలినేని మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ నలుగురు వెనుక..
టీడీపీ ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అనూహ్యంగా టీడీపీలో చేరారు. అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అయిన వారిలో ఉన్నారు. అయితే వీరు పార్టీ మారడం వెనుక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారని తాజాగా ఆరోపణలు వినిపిస్తుండడం విశేషం. అయితే ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు కొత్తగా బాలినేనిపై ఆరోపణలు రావడం విశేషం. దీంతో తనను పార్టీలో ఉంచరని దాదాపు డిసైడయిన బాలినేని హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడనంటూనే.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంపముంచిన వైవీ…
అయితే తనకు ఈ పరిస్థితికి వైవీ సుబ్బారెడ్డేకారణమని బాలినేని ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడం, జిల్లాలో ఎటువంటి పవర్స్ లేకుండా చేయడం, జగన్ వద్ద పరపతి తగ్గిపోవడంతో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చారు.  వాస్తవానికి బాలినేని, వైవీ బావాబామ్మ‌ర్దులు అయిన‌ప్ప‌టికీ, ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి.త‌న‌కు వ్య‌తిరేకంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను వైవీ ఉసిగొల్పుతున్న‌ట్టు బాలినేని బ‌లంగా న‌మ్ముతున్నారు. మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఇలా అంద‌రితోనూ బాలినేనికి వైర‌మే. మంత్రి ప‌ద‌వి పోవ‌డం, జ‌గ‌న్ వ‌ద్ద ప‌లుకుబ‌డి త‌గ్గింద‌నే స‌మాచారంతో బాలినేనిపై సొంత పార్టీ ముఖ్యులు ఫిర్యాదులు చేయ‌డం మొద‌లు పెట్టారు.

బ్యాడ్ డేస్ స్టార్ట్
వైసీపీ ఆవిర్భావం నుంచి బాలినేని జగన్ వెంట నడవడం నిజం. అందుకు తగ్గట్టుగానే సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని కాదని జగన్ బాలినేనికి మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే ప్రధానంగా టీడీపీలోకి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేను పంపించారన్న కారణం చూపి బాలినేనిపై ఫిర్యాదులు పంపించడంలో వైవీ సక్సెస్ అయ్యారని టాక్ నడుస్తోంది. దాని ఫలితంగానే పార్టీ నుంచి బాలినేని వెళ్లిపోయినా పర్వాలేదని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కార‌ణాలేవైనా వైసీపీలో బాలినేనికి బ్యాడ్ డేస్ మొద‌లైన‌ట్టు క‌నిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న ఇబ్బంది ప‌డుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.