Nandamuri Balakrishna: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే కూడా. పైగా ఆయన గత ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అందుకే ఆయనకు తన నియోజకవర్గం హిందూపురం అంటే ప్రత్యేక అభిమానం. తన అభిమానాన్ని చూపించడానికి బాలయ్యకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆ నిర్ణయంలో భాగంగా బాలయ్య తన హిందూపురంను కూడా జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు, పైగా నేడు మౌన దీక్షకు కూడా కూర్చున్నారు. అంతే కాకుండా దానికి సత్య సాయి జిల్లాగా పేరు పెట్టాలని కూడా బాలయ్య డిమాండ్ చెయ్యడం విశేషం. అయితే, ఈ సందర్భంగా బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తానని బాలయ్య చెప్పారు.
Also Read: బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయి.. నిత్యం అందులో పెట్టి తీసుకెళ్తున్న అబ్బాయి..
దీక్ష ప్రారంభించే ముందు తన రాజీనామా విషయాన్ని బాలయ్య చెప్పి షాక్ ఇచ్చారు. ఒకవేళ బాలయ్య ఈ సంచలన నిర్ణయం తీసుకుంటే.. నిజంగా రాజకీయాల్లో బాలయ్య క్రేజ్ అమాంతం పెరుగుతుంది. మొత్తానికి బాలయ్య అరవై దాటాక సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. బాలయ్య ఇలాగే తన స్థాయిని పెంచుకుంటూ పోవాలని ఆశిద్దాం.
అయినా ఆంధ్ర సీఎం జగన్ ఒకప్పుడు బాలయ్యకు వీరాభిమాని. కాబట్టి.. జగన్, బాలయ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా తన సినిమాలతో పాటుగా బాలయ్య తన రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఇంతకీ బాలయ్య రాజీనామా వరకూ వెళ్తే.. జగన్ ప్రభుత్వానికే నష్టం.