Alia Bhatt: ‘సంజయ్‌లీలా భన్సాలీ’ సినిమా అంటే… భారీ తనం మిళితమైన ఓ వైవిధ్యభరితం. అలాంటి గ్రేట్ విజువల్ డైరెక్టర్ దర్శకత్వంలో ‘గంగూభాయ్ కతియావాడీ’గా కనిపించి అలరించబోతుంది అలియా భట్. ‘మగాళ్లకు ఎందుకింత పొగరు’ అంటూ తాజాగా అలియా ఈ సినిమా ట్రైలర్ తో వచ్చింది. అలియా గెటప్, క్యారెక్టర్ అండ్ సెటప్ అదిరిపోయాయి. అలియాలో ‘గంగూభాయ్’ మమైక పోయింది.
కట్టుబొట్టుతో పాటు మాటతీరు, చూపుల తీరులో అచ్చం ‘గంగూభాయ్’లా అలియా అదరగొట్టింది. ఇక ట్రైలర్ లో సినిమా కథా గమనాన్ని కూడా బాగా ఎలివేట్ చేశారు. ‘కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్ ఉంటుంది’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ లో.. కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో అనుకోకుండా చిక్కుకున్న ఒక సాధారణ అమ్మాయి.. ఆ తర్వాత తన చాతుర్యంతో గంగూబాయిగా ఎదిగి.. ఆ ఏరియాకి రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగింది ? ఎవర్ని ఎలా ఎదిరించింది ? అనే కోణంలో సాగింది ఈ ట్రైలర్.
Also Read: మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్.. నిజమేనా ?
ఇక గంగూబాయి తన ప్రయాణంలో చేసిన పోరాటాన్ని, ఆమె ఆవేశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. మొత్తానికి ఈ ట్రైలర్.. సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో అలియా పలికిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం’ అని చెప్పిన డైలాగ్ బాగా పేలింది.
అలాగే, ‘కామాఠిపుర రజియా భాయ్ సొంతం’, ‘రజియా భాయ్ పేరు చెపితే వాంతులు వస్తున్నాయి’. అదే విధంగా ‘అమ్మ పేరు ఒకటి చెపితే చాలదా?’ అనే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే.. ఈ సినిమా మొత్తం ఆలియా భట్ వన్ మ్యాన్ షో చేసిందని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో అలియా నటనకే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాలో ఆమె నటనకు నీరాజనాలు పట్టడం ఖాయం.
చాలా చిన్న వయస్సులోనే గంగూబాయి లాంటి బరువైన పాత్రను పోషించి ఔరా అనిపించడం ఒక్క అలియాకే సాధ్యం. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, హుమా ఖురేషి, ఇమ్రాన్ హస్మీ ప్రత్యేక పాత్రలలో కనిపించబోతున్నారు. మొత్తానికి అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన ఆర్ఆర్ఆర్ తో పాటు గంగూబాయి కతియావాడీ లాంటి రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.
Also Read: Chiranjeevi: 40 ఏళ్ల కెరీర్ లో చిరంజీవి ‘లిప్ కిస్’ పెట్టింది ఆ ఒక్క హీరోయిన్ కే