Balakrishna Tweet: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలను వైసీపీ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ తమకు అంత మాటలు అంటారా.. దానికి రెట్టింపు వ్యాఖ్యలు చేయండంటూ పార్టీ శ్రేణులకు హైకమాండ్ నుంచి సందేశాలు వెళ్లాయి. దీంతో గత మూడు రోజులుగా వైసీపీ నేతలు తమ నోటికి పనిచెప్పారు. బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకరి తరువాత ఒకరు అన్నట్టు వంతులు వేసుకొని మరీ బాలకృష్ణను ఆడిపోసుకుంటున్నారు. చివరకు మంత్రి రోజా బాలకృష్ణ డైలాగును గుర్తుచేస్తూ కామెంట్స్ చేశారు ఫ్లూటు చంద్రబాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదని షటైర్లు వేశారు. అయితే బాలకృష్ణ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు.

అయితే బాలక్రిష్ణ పై వైసీపీ నేతలు అంతగా రియాక్డు కావడానికి కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. వైసీపీ అంతరంగిక విషయాలు తెలిసిన వారికి తప్పిస్తే మిగతావారేవరికీ తెలిసే చాన్స్ లేదు. అయితే బాలక్రిష్ణ విషయంలో మాత్రం వైసీపీ అగ్రనేతలు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. తొలుత ట్విట్టర్ లో స్పందిన బాలక్రిష్ణ ‘మార్చేయ్యడానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఒక సంస్కృతి..ఓ నాగరికత..తెలుగుజాతి వెన్నుముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి హెల్త్ యూనివర్సిటీ మార్చాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి…తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ ఓ రెంజ్ లోఫైర్ అయ్యారు. అంతటి తో ఆగకుండా మరో ట్విట్ చేశారు. 0‘ఆ మహనీయుడు ఎన్టీఆర్ భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు..పీతలున్నారు.. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయి…శునకాల ముందు తలదించుకునే సిగ్గులేని బతుకులు’ అంటూ బాలకృష్ణ విరుచుకుపడ్డారు.
తమను ఉద్దేశించి బాలక్రిష్ణ అంతలా కామెంట్స్ చేస్తారా అంటూ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు మించి కామెంట్స్ చేయండని తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రకటించడమే తరువాయి వైసీపీ నేతలు నోరు వేసుకొని ముందుకొచ్చారు. అలాగని వైసీపీ నేతంతా ఒకేసారి మీడియా ముందుకు రాలేదు. వ్యూహాత్మకంగా ఒకరి తరువాత ఒకరు కామెంట్స్ చేశారు.అయితే మీడియాతో ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? సోషల్ మీడియాలో ఎవరెవరు ఏ పోస్టులు పెట్టాలి? అన్నది క్యాంపు ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలపై ఉంటుంది. ఆ ప్రకారం వారంతా బాలక్రిష్ణపై స్పందించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి కొట్టేస్తామని కూడా హెచ్చరికలు జారీచేశారు.
వైసీపీలో పదవులు పొందిన నేతలెవరికీ స్వేచ్ఛ ఉండదు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులోనే అధికారాలన్ని పదిలంగా ఉంటాయి. పేరుకే పదవులు కానీ..అధికార విధుల్లోవారు ఎక్కడా కనిపించరు. తమ శాఖ గురించి అయినా బయటకు వెల్లడించే అవకాశం మంత్రులకు ఉండదు. పాలనా, పార్టీ, ప్రభుత్వ విధానాలన్ని సలహదారులే ప్రకటిస్తారు. అయితే పదవులు ఉన్న నేతలకు ఏం పని ఉండదు. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి బూతులు మాట్లాడడమే పని అన్నట్టు వ్యవహరిస్తారు. గత మూడు రోజులుగా బాలక్రిష్ణ విషయంలో అదే పనిచేస్తున్నారు.