Babita Phogat : ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఫాతిమా సనా షేక్, జైరా వాసిం ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భారత మల్ల యోధులు గీత ఫొగాట్, బబితా ఫొగాట్, తండ్రి మహావీర్ జీవిత కదా ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్లను వసూలు చేసింది.. అయితే ఈ సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాల తర్వాత మల్ల యోధురాలు బబితా ఫొగాట్ నిర్మాతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏకంగా అమీర్ ఖాన్ తో యుద్ధానికి దిగింది. విలేకరుల సమావేశంలో తన ఆవేదనను మొత్తం వ్యక్తం చేసింది. ” మీ జీవిత కథను ఆధారంగా చేసుకుని వేలకోట్ల వ్యాపారం చేసి.. మీకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారు కదా.. మీకు ఏమాత్రం బాధ లేదా” అని విలేఖరి బబితను ప్రశ్నించాడు.. దానికి బబిత తనదైన శైలిలో సమాధానం చెప్పింది..”సమాజంలో ఉండే మనుషుల నుంచి ప్రేమ, గౌరవాన్ని మాత్రమే ఆశించాలని మా నాన్న చెప్పేవారు.. మా సొంత గ్రామంలో మల్ల విద్యకు సంబంధించి ఏర్పాటు చేసే అకాడమీకి డబ్బులు లేక ఇబ్బంది పడ్డాం. అప్పుడు దంగల్ చిత్ర నిర్మాణ సంస్థను సంప్రదించాం. అయితే ఆ సమయంలో సరైన సమాధానం చెప్పలేదు. అకాడమీ నిర్మాణానికి దాదాపు 5 కోట్లు వ్యయం అవుతుందని” బబిత వ్యాఖ్యానించింది. బబిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెనుమారం చెలరేగుతున్నది. అమీర్ ఖాన్ వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు సినిమాల్లో మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్ అని.. నిజ జీవితంలో పక్కా కమర్షియల్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
2016లో విడుదల..
2016లో దంగల్ సినిమా విడుదలైంది. బబిత, గీత, వారి తండ్రి మహావీర్ జీవితం ఆధారంగా దంగల్ సినిమాను రూపొందించారు. కుమార్తెలను మల్ల యోధులుగా తీర్చి దిద్దడానికి మహావీర్ తీవ్ర పోరాటం చేశాడు. దాని చుట్టూ ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది. ఈ దృశ్యాలను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించడంలో నితీష్ తివారి తన నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. బబిత 2010లో కామన్ వెల్త్ క్రీడలలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 2014లో స్వర్ణాన్ని సాధించింది. అనంతరం 2019లో బబిత రెజ్లింగ్ కు స్వస్తి పలికింది. ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసింది.. కాగా, సాక్షి మాలిక్ పై కూడా బబిత తీవ్ర ఆరోపణలు చేసింది. నాడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ వీధిలో నిరసన చేపట్టారు. అయితే ఆ నిరసన నేపథ్యంలో బబిత తమను సంప్రదించారని సాక్షి మాలిక్ ఆరోపించారు. ఈ ఆరోపణలను బబిత తీవ్రంగా ఖండించారు. నాడు రెజ్లర్లు చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్దకు ప్రియాంక గాంధీ ఎందుకు వచ్చారని.. ఆమె ఆహారం ఎందుకు పంపించారని బబిత మండిపడ్డారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Babita phogat revealed the real character of aamir khan who gave rs 2000 crores for the movie dangal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com