Fake Journalists: దేశంలో ఉగ్రవాదం వివిధ రూపాల్లో విస్తరిస్తోంది. విద్యార్థులు, యువత, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, మదరసాలు.. ఇలా అన్నీ ఉగ్రవాదులకు కేంద్రాలుగా మారుతున్నాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కొందరు పేక్ జర్నలిస్టులు కూడా జర్నలిజం ముసుగులో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నారు. దేశ భద్రతకు ప్రధాన ముప్పు అంతర్జాతీయ నెట్‌వర్కులు, ఆయుధ శక్తులే కాకుండా సమాచారం దొంగిలించే ముసుగు పాత్రలు కూడా అవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఫేక్ జర్నలిస్టులు. పత్రికల పేర్లతో, తప్పుడు ఐడెంటిటీ కార్డులతో సామాజిక వర్గాల్లో చొరబడి, ఉగ్రవాదులకు రక్షణ కల్పించేవారు వీరే.
ఉగ్రవాదులకు సమాచారం..
జర్నలిస్టులు ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. కానీ కొందరు ఈ ముసుగులో సంఘ విద్రోహులు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. ఇటీవలి విచారణల్లో అనేకమంది ఉగ్రవాదులతో అనుబంధం ఉన్నవారు ‘‘మీడియా రిపోర్టర్’’ పేరుతో దళాలకు కీలక సమాచారం అందజేసినట్లు కశ్మీర్ ప్రభుత్వం గుర్తించింది. వీరు పోలీస్ శాఖ, పౌరసంబంధ శాఖ అధికారులను బెదిరించి అనుమానితులకు సమాచారం ఇస్తూ ఉగ్రశిబిరాలతో రహస్య సంబంధాలు కొనసాగించారు.
ప్రభుత్వ కఠిన చర్యలు
జమ్మూకశ్మీర్ పరిపాలన ఈ దశలో తీవ్రంగా చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ ఐడియాలతో కార్యకలాపాలుప్రారంభించిన వ్యక్తుల జాబితా తయారుచేసి, వారిని అధికారిక మీడియా జాబితాల్లో నుంచి తొలగిస్తున్నారు.
సోషల్ మీడియా నెట్‌వర్కులపై కంట్రోల్
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఆన్‌లైన్ న్యూస్ పేజీల పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫేక్ వార్తా ఖాతాలను గుర్తించేందుకు ప్రత్యేక సైబర్ విభాగం ఏర్పాటైంది. ఈ పేజీల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నవారిపై తీవ్ర నిఘా ఉంది. దేశవ్యాప్తంగా పోలీసులు, సివిల్ అధికారులు ఇలాంటి సామాజిక ముసుగులో ఉన్న ఎలిమెంట్లపై తగు అవగాహనతో వ్యవహరించడం ఇప్పుడు అత్యవసరం. నిజాయితీ జర్నలిస్టులు, వాస్తవాల ఆధారతనే రక్షణగా ఉంచుకుని విరోధక ప్రచారాల నుంచి మీడియా స్వచ్ఛతను నిలబెట్టుకోవాలి.
జమ్మూకశ్మీర్ చూపిస్తున్న ఈ చర్యలు దేశవ్యాప్తంగా నకిలీ మీడియా వలయాలను కట్టడి చేయాలి. ఉగ్రవాదానికి సమాచారం అందకుండా చేస్తే భద్రత మరింత బలపడుతుంది.