https://oktelugu.com/

Minister Roja: మంత్రి రోజాపైకి కుక్క దాడికి యత్నం.. వీడియో వైరల్..

Minister Roja: ఏపీ మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె శ్రీవారిని దర్శించుకునేందకు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ఎదురుగా ఓ శునకం వచ్చింది. అంతేకాకుండా ఆమెపై దాడి చేసేందుకు రెడీ అయింది. సాక్షాత్తూ మంత్రి రోజాకే ఇలా జరిగితే.. సామాన్య భక్తుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే శ్రీవారి ఆలయంలో ఇలా శునకాలు తిరగడంపై భక్తులు తీవ్ర చర్చ పెట్టుకుంటున్నారు. అదీ మంత్రి రోజా వచ్చిన సమయంలో ఇలా దర్జాగా […]

Written By:
  • Mahi
  • , Updated On : March 3, 2023 / 09:54 AM IST
    Follow us on

    Minister Roja

    Minister Roja: ఏపీ మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె శ్రీవారిని దర్శించుకునేందకు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ఎదురుగా ఓ శునకం వచ్చింది. అంతేకాకుండా ఆమెపై దాడి చేసేందుకు రెడీ అయింది. సాక్షాత్తూ మంత్రి రోజాకే ఇలా జరిగితే.. సామాన్య భక్తుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే శ్రీవారి ఆలయంలో ఇలా శునకాలు తిరగడంపై భక్తులు తీవ్ర చర్చ పెట్టుకుంటున్నారు. అదీ మంత్రి రోజా వచ్చిన సమయంలో ఇలా దర్జాగా తిరగడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. తిరుమల ఆలయ పరిసరాల్లో శుచి శుబ్రత పాటిస్తున్నామని చెబుతున్న అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా కుక్కలు తిరగడంపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక రోజా వచ్చిన సమయంలో కుక్కలు దర్జగా తిరిగిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

    ఓవైపు తెలంగాణ ప్రజలకు కుక్కలు కనిపిస్తే జంకుతున్నారు. ఇటీవల అంబర్ పేటలో బాలుడి ఘటన తరువాత గుంపులుగా శునకాలు కనిపిస్తే దూరంగా వెళ్తున్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసి అవగాహన కల్పిస్తోంది. స్కూళ్లల్లో ప్రార్థనా సమయంలో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సాక్షాత్తూ తిరుమల శ్రీవారి సన్నిధిలో కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు.

    అయితే ఇలా కుక్కలు తిరగడం ఆలయానికి దూరం అయితే పర్వాలేదు. కానీ సాక్షాత్తూ శ్రీవారి ఆలయం ఆవరణలో కనిపించడం తీవ్ర చర్చ సాగుతోంది. ఇటీవల మంత్రి రోజా శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆమె ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో ఓ శునకం అక్కడికి రావడంతో కొందరు మీడియాకు చెందిన వారు తమ కెమెరాలను అటువైపు తిప్పారు. అక్కడ కుక్కలు తిరగడాన్ని వీడియో తీశారు. అయితే కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్చకు దారి తీస్తున్నారు.

    Minister Roja

    ఎంతో నిష్టతో భక్తులు శ్రీవారి ఆలయానికి వస్తారు. ఇలాంటి సందర్భాల్లో అసౌకర్యం కలగడం వల్ల వారు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో కోతుల బెడత తీవ్రంగా ఉంది. వీటి నివారణకు ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా అందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కుక్కలు కూడా ఆలయ పరిసరాల్లో తిరగకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    Tags