Attacks On TDP Offices
Attacks On TDP Offices : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ లేనివిధంగా ఒక్కసారిగా భారీ కుదుపునకు గురయ్యాయి. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ తోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీకి చెందినపలు కార్యాలయాలు, టీడీపీ నేత పట్టాభి సహా ఇతర నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన టీడీపీ నేతల తలలు పగులగొట్టారు. కార్యాలయాలను ధ్వంసం చేశారు. ముందున్న కార్లను నాశనం చేశారు. టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనమయ్యాయి.
Attacks On TDP Offices
మొట్టమొదటగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసాన్ని ధ్వంసం చేశారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఒకే సమయంలో ఎక్కడి నుంచి ఎవరో సమన్వయం చేసినట్లుగా జిల్లాల్లో ఒకేసారి టీడీపీ కార్యాలయాలపై భారీ దాడులు జరగడం కలకలం రేపింది. ఇదంతా కావాలనే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడులన్నీ ఒకే సమయంలో చాలా నష్టం జరిగేలా విరుచుకుపడి చేసేశారు.
టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడకు వచ్చి పార్టీ ఆఫీసును పరిశీలించారు.టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. దాడుల్లో గాయపడ్డవారిని పరామర్శించారు. పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు వెంట దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర. టీడీపీ కార్యాలయంలోనే ఉన్న పట్టాభిని పరామర్శించారు.
అనంతరం ఈ దాడులపై ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేశారు. తమకు ఏపీలో కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే టీడీపీ నేతలు, కార్యాలయాలకు రక్షణ కల్పిస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలిసింది.
అనంతరం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘సీఎం జగన్ రెడ్డి మీ దాడులు అన్నింటిని గుర్తుంచుకుంటామని’ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు.
– సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి బూతులు తిట్టడమే దాడులకు కారణమా?
ఇక టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తాజాగా టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ సీఎం జగన్ పై బూతులతో రాయడానికి వీల్లేని పదాలతో తిట్టడమే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. ఏపీలో గంజాయి వ్యాపారానికి , జగన్ కు ముడిపెడుతూ పట్టాభి నోరుపారేసుకున్నారు. జగన్ ను ఉద్దేశించి ‘రేయ్.. బోసిడేకే’ అంటూ తన నోటిదురుసును ప్రదర్శించినట్టు తెలిసింది. దీనికి పర్యావసనంగానే మొదట పట్టాభి ఇంటిపై మొదలైన దాడులు టీడీపీ ఆఫీసుల ధ్వంసం వరకూ సాగిందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. పట్టాభి దుర్భాషలకు నిరసనగానే టీడీపీ కార్యాలయాలు, ముఖ్య నాయకుల ఇళ్లపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేసి నిరసన తెలిపినట్టు తెలిసింది. పట్టాభి ఇల్లు, టీడీపీ మంగళగిరి కార్యాలయం, విశాఖ , చిత్తూరు కార్యాలయాలు, రేణిగుంట టీడీపీ ఇన్ చార్జి సుధీర్ రెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. మరి ఇది ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధానికి దారితీసేలానే కనిపిస్తోంది.
-టీడీపీ ఆఫీసులపై దాడులకు సంబంధించిన వీడియోలు..
TDP main office in Mangalagiri attacked allegedly by YSRCP party workers. @JaiTDP @YSRCParty @APPOLICE100 #Politics #AndhraPradesh pic.twitter.com/WeurS0w73b
— Revathi (@revathitweets) October 19, 2021
#YCPGoons https://t.co/AVjHD95wU7 pic.twitter.com/gL0oURMPxN
— Gangadhar Thati (@GangadharThati) October 19, 2021
పెద్ద సుత్తులు, కర్రలతో స్వేచ్ఛగా దాడి. Employees in the TDP office being attacked with big hammers and sticks. pic.twitter.com/In1mkqAq9P
— Ramesh Kandula (@iamkandula) October 19, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Attacks on tdp offices across ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com