Major Unnikrishnan: 26 /11 ముంబై లోని తాజ్ హోటల్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల ఆధారంగా డైరెక్టర్ శశి కుమార్ తెరకెక్కించిన చిత్రం మేజర్..ఈ దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు..ఇందులో ఉన్నికృష్ణన్ గా అడవి శేష్ నటించగా సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పర్చిన ఈ సినిమా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది..విడుదలకి ముందు ఈ సినిమా జనాల్లో ఎలాంటి అంచనాలను అయితే సెట్ చేసిందో..ఆ అంచనాలకు మించే ఈ సినిమా వారిని అలరించడం విశేషం..ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టేలా చేసింది.ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు..సినిమా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు లేచి చప్పట్లు కొట్టే రేంజ్ లో ఈ సినిమా వచ్చింది అంటే డైరెక్టర్ శశి కుమార్ పనితనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో కొంతమంది యాంకర్లు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ’26 /11 దాడుల్లో ఎంతో మంది సైనికులు ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలను వదిలారు..కానీ మీరు ఉన్ని కృష్ణన్ కథనే ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారు’ అని అడిగిన ప్రశ్నకి డైరెక్టర్ శశి కుమార్ సమాధానం చెప్తూ ‘ఉన్నికృష్ణన్ గారి స్టోరీ మొత్తం నాకు తెలుసు..ఆయన ఉగ్రవాదులతో పోరాడిన తీరు ని చెప్తూ ఉంటె నా రోమాలు నిక్కపొడుచుకొని చేసింది..మీరు అన్నట్టు ఉన్నికృష్ణన్ గారే కాదు..చాలా మంది ఆ దాడుల్లో తమ ప్రాణాలను వదిలారు..వారి స్టోరీ ని కూడా ఎవరో ఒక్క డైరెక్టర్ కచ్చితంగా తీస్తారు..కానీ అలా ఎవరి బయోపిక్ అయినా తియ్యాలి అంటే వారి తల్లి తండ్రులు లేదా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి..లేదంటే చాలా లీగల్ సమస్యలు ఎదురు అవుతాయి..ఉన్ని కృష్ణన్ గారి తల్లి తండ్రులు నాకు బాగా తెలుసు..వారు నేను ఈ కథని రాయడానికి నాకు ఎంతో సహకరించారు..ఉన్నికృష్ణన్ గారి హావభావాలు మరియు ఆయన జీవన విధానం ని చాలా దగ్గర ఉంది తెలుసుకోగలిగాను..అందుకే ఈ సినిమాని అంత అద్భుతంగా తియ్యగలిగాను..ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది అనే గట్టి నమ్మకం తో ఉన్నాను’ అంటూ చెప్పొచ్చాడు ఆ చిత్ర దర్శకుడు శశి కుమార్.

Also Read: Mahesh Babu- Rajamouli: రాజమౌళి మూవీ జోనర్ ఏంటి? మొదటిసారి నోరు విప్పిన మహేష్!
Recommended Videos:
[…] […]
[…] […]
[…] […]