Attacks on Hindu temples : బంగ్లాదేశ్ కు బతుకునిచ్చింది భారత్. ఆ దేశానికి ఊపిరిపోసింది మనమే. ముస్లిం జనాభా అధికంగా ఉండే అక్కడ హిందువులు మైనార్టీలు. అయినా భారత్ లో ఒకప్పుడు అంతర్భాగంగా కలిసి పోయేది. కానీ నేడు ఆ దేశం భారత్ పై అక్కసుతో ఉంది. అక్కడి జనాలు భారత్ పై విషం చిమ్ముతున్నారు. అక్కడ హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా దుర్గామాత మంటపాలపై మొదలైన ఈ దాడులు కొందరు అదేపనిగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత్ కు చెందిన హిందువులు, బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఏ విధంగా స్పందించలేదు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినపుడు బాధితులకు సంఘీభావం తెలపడానికి భారత్ ప్రతినిధులను పంపేది. కానీ ఇప్పుడు అలాంటి నిర్ణయాలేమీ తీసుకోకపోవడంపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

తమ దేశంలో జరుగుతున్న ఈ సంఘటనలను అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చర్యలు తీసుకుంటున్నారని తెలిపినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. అయితే ప్రధాని షేక్ హసీనాపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. భారత్ నమ్ముతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధానితో మాట్లాడడం గాని, ఇతర ఎటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని షేక్ హసీనాను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నరేంద్ర మోదీ అనుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లోని భారత రాయభార కార్యాలయ ప్రతినిధులు సంఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లారు. ఆ దేశంలో హిందువుల హక్కుల గురించి వారు బహిరంగంగా ప్రకటన చేశారు. అయితే గతవారం చిట్టగాంగ్, చాంద్ పూర్, కుమిల్లా, ఫేనిలక్లోని హిందువుల ఆలయాలు, వారి ఇళ్లపై జరిగిన దాడుల్లో పలువురు మరణించారు. కానీ ఈ విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోవడం లేదని అంటున్నారు. కానీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్వి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పోలీసులను పంపించారు అని తెలిపారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు.
బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలపై బహిరంగ ప్రకటనలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లవుతుందని భారత్ ఆలోచిస్తోంది. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి మాత్రం ఆందోళనకరంగానే ఉందని ఢిల్లీకి చెందిన వివేకానాంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చెందిన శ్రీధర్ అభిప్రాయపడ్డారు. అయితే సంఘటనల్లోని దోషులకు క్షమాభిక్ష కూడా పెట్టని విధంగా శిక్షలు వేస్తామని ప్రధాని షేక్ హసీనా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలపై దాడులు కొత్తేమీ కాదు. కానీ ఈసారి జరిగిన దాడులు ఇంతకుముందెన్నడూ జరగలేదు. అయితే ఇందులో పెద్ద కుట్ర దాగున్నదని అంటున్నారు. ప్రధాని షేక్ హసీనాను తప్పించేందుకే కొందరు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కుట్రలో భాగంగా ఒక మతపరమైన హింసను ప్రేరేపించి ప్రభుత్వాన్ని బలహీనపర్చడమేనని అంటున్నారు. కానీ అది సాధ్యం కాలేదని ఢాకాలో భారత హైకమిషనర్ గా పనిచేసిన పినాక రంజన్ చక్రవర్తి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దాడులు ప్రధానికి వ్యతిరేకంగా జరుగుతున్నవేనని అని ఆయన అంటున్నారు.
అప్ఘనిస్తాన్లో జరిగిన దాడులతో బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ లోని ఫండమెంటలిస్టులను ప్రేరేపించాయి. మరోవైపు షేక్ హసీనాను భారత్ కు చెందిన వ్యక్తిగా వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. కానీ ఈ మధ్య ఇవి బాగా పెరిగాయి. ఇటీవల హిందువుల ఆలయాలపై కొందరు దాడులు చేస్తూ కొందరు నిరసన తెలిపారు. అందులో భాగంగా వారు పట్టుకున్న ప్లకార్డులపై షేక్ హసీనా భారత్ కు చెందిన వ్యక్తి అని చెప్పే విధంగ రాశారు. దీనిని భట్టి ప్రధానికి వ్యతిరేకంగానే ఈ నిరసనలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు.