Attack On YCP MLA: వైసీపీలో రాజకీయ కక్షలు రాజ్యమేలుతున్నాయి. సొంత పార్టీలోనే వేరు కుంపట్లను ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులే ప్రజాకంటకులుగా మారుతున్నారు. దీంతో పార్టీ పరువు పోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం పెంచిపోషిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి.కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు. అసమ్మతి వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని ఆగ్రహంతో ఎమ్మెల్యేను కొట్టారు.

గ్రామంలో గంజి ప్రసాద్ అనే వైసీపీ నేతను ప్రత్యర్థి వర్గం వారు హత్య చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంకట్రావు పరామర్శించేందుకు వెళ్లారు. ఇక్కడ ఎమ్మెల్యే రెండు వర్గాలను పెంచి పోషిస్తున్నారు. అందులో ఒక వర్గం ఎమ్మెల్యేది కాగా మరో వర్గం గంజి ప్రసాద్ ది. దీంతో గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే కారణమని గ్రామస్తులు భావించారు. దీనికి తోడు ఎమ్మెల్యే అక్కడ కూడా వ్యతిరేక వర్గంతోనే మాట్లాడటంతో ఊగిపోయిన గ్రామస్తులు ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు.
Also Read: Machilipatnam: తండ్రి స్థానంలో ఉన్న వాడే కీచకుడిగా మారితే..
పోలీసులు రక్షణగా ఉన్నా వారి వినిపించుకోలేదు. వర్గ విభేదాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైసీపీ పరువు గంగలో కలుస్తోంది. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు రాజేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు చాలా మంది బలైపోతున్నారు. తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజలను బలిపశువులుగా చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం జగన్ ఇలా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఇంకెతంత కాలం పరిపాలన చేస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మనుగడ కోసం ఇతరుల ప్రాణాలు తీయడం సమంజసం కాదని చెబుతున్నారు.

గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే ప్రోత్సాహమే కారణమని తెలుస్తోంది. విభేదాలు తొలగించి అందరిలో ఐకమత్యం తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాల్సిన నేతలే ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ బతికి బట్ట కట్టడం కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాగే సొంత పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం జరుగుతూనే ఉంది. దీన్ని అడ్డుకోవడానికి అధినేత ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు వీటిని ప్రోత్సహిస్తున్నారు? అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Ganji Prasad Murder Case: ఆ హత్యను మేమే చేశాం: గంజి ప్రసాద్ హత్య కేసులో ట్విస్ట్



[…] Also Read: గోపాలపురం ఎమ్మెల్యేపై ప్రజలు దాడి చే… […]