AP Assembly Fight : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయోత్సవంలో ఉన్న టీడీపీకి వైసీపీ షాకిచ్చింది. ఏకంగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్న వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం దాడులు చేసింది. అసెంబ్లీ లైవ్ టెలీకాస్ట్ ను బంద్ చేసి మరీ వికృత క్రీడకు తెరలేపింది. అయితే తిరిగి స్పీకర్ పైనే టీడీపీ ఎమ్మెల్యేలు దాడిచేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. అదే నిజమైతే అసెంబ్లీలోని వీడియోలను బయటపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సర్వత్రా చర్చనీయాంశం కావడంతో దానిని నుంచి డైవర్ట్ చేసే క్రమంలో ఘటనకు దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్రీ ప్లాన్ ప్రకారం దాడులకు దిగడమే దీనికి నిదర్శనం.
జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తూంటే ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. పక్కా ప్లాన్ ప్రకారం ఎవరు ఎవరిపై దాడిచేయాలో ముందుగా నిర్ణయించుకున్నట్లుగా టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారు. సుధాకర్ బాబు దాడి చేయడంతో ఒక్క సారిగా అసెంబ్లీలో లైవ్ ఆపేశారు. దృశ్యాలు కనిపించకుండా చేశారు. సుధారర్ బాబును అడ్డుకునేందుకు టీడీపీ నేతుల ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది . దీంతో సభను స్పీకర్ హడావుడిగా వాయిదా వేశారు. తర్వాత టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ీ అంశంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తమ పై దాడి జరిగిందని… మొత్తం వీడియోను బయట పెట్టాలని శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దాడిని ఖండించారు. ఇదో చీకటిరోజుగా అభివర్ణించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎమ్మెల్యేలపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. సిఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే దళిత ఎమ్మెల్యేపై దాడికి దిగారని ఆరోపించారు. నేటి ఘటనతో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దాడులకు దిగుతుండడం వైసీపీ సిద్ధాంతాలను తెలియజేస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో పిచ్చెక్కి వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శాసన సభ కౌరవసభగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ స్పందించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న ఆయన వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలకి నిలువెత్తు సంతకంలా నిలిచే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగబడటం దారుణన్నారు. బుచ్చయ్య తాతపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్ డేగా అభివర్ణించారు. ఏడుపదుల వయస్సు దాటిన పెద్దాయనని చూస్తేనే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందని.. అటువంటి వ్యక్తిపై దాడిచేయాలని ఎలా అనిపించిందని ప్రశ్నించందన్నారు. సొంత బాబాయ్ నే వేసేసినోళ్లు బుచ్చయ్య చౌదరిలాంటి వ్యక్తిని గౌరవిస్తారనుకోవడం వృథా ప్రయాసేనన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాక్షన్ చరిత్రను కుర్రకారు కాల్చి వాతలు పెట్టిన బుద్ధి రాలేదన్నారు. ఇదో బ్లాక్ డే అని.. దీనికి వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.