
భారత్ లో గత కొన్నిరోజులుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో బంగారం ధరలు పెరగగా ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తే మంచిది. లేకపోతే మాత్రం భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,710 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే 44,650 రూపాయలుగా ఉంది. 2021 సంవత్సరం చివరినాటికి బంగారం ధర 65,000 రూపాయలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.
హైదరాబాద్ తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బంగారం ధర మరింత తక్కువగా ఉంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లు ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు బంగారం విషయంలో నిపుణుల అంచనాలు కూడా తప్పే అవకాశాలు అయితే ఉంటాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేసినా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
వేర్వేరు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువని చెప్పవచ్చు. 10 సంవత్సరాల 10 గ్రామల 24 క్యారెట్ల బంగారం ధర 18,000 రూపాయలుగా ఉండగా కొన్ని సంవత్సరాల్లోనే బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.