Gali Janardhan Reddy Attack: గాలి జనార్దన్‌రెడ్డి.. రాజకీయాలపై అవగాహన ఉన్న ఏపీ, తెలంగాణ ప్రజలకు పరిచయం ఉన్నపేరు. ఏపీ, కర్ణాటక సరిహద్దులో అక్రమ మైనింగ్ కేసులో జైలుశిక్ష కూడా అనుభించారు. కర్ణాటక మాజీ మంత్రి. బడా వ్యాపారి అయిన గాలి జనార్దన్‌రెడ్డిపై తాజాగా హత్యాయత్నం జరిగింది. బళ్లారి నగరంలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీశ్‌రెడ్డి ఎటాక్ చేశాడు. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే గాలి జనార్దన్ తృటిలో తప్పించుకున్నారు.
గన్‌మెన్ తుపాకీ లాక్కుని..
సతీశ్‌రెడ్డి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి గన్‌మెన్ తుపాకీ లాక్కుని జనార్దాన్‌రెడ్డిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాలి జనార్దన్ అనుచరుడు మృతచెందాడు. మరోవైపు ప్రతిదాడిలో సతీశ్‌రెడ్డి కూడా గాయపడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు పోలీసులు అందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
ఏం జరిగిందంటే..
మహర్షి వాల్మీకి విగ్రహ స్థాపన వివాదం నుంచి గొడవ ప్రారంభమైంది. గాలి జనార్దన్‌వర్గం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. భరత్ రెడ్డి సర్కిల్ వ్యతిరేకించడంతో టెన్షన్ పెరిగింది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య పాత రాజకీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వివాదం హింసాత్మక దాడికి మారడంతో స్థానిక రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
పోలీసులు సతీశ్‌రెడ్డి సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గాలి జనార్దన్ భద్రత పెంచారు. స్థానిక నాయకులు శాంతి కోరుకుంటూ, విచారణకు సహకరించాలని సూచించారు. ఈ ఘటన బళ్లారి రాజకీయాల్లో వివాదాలు మరోసారి బయటపడ్డాయి.
బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం..
ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు
గన్‌మన్ తుపాకీ లాక్కుని రెండు రౌండ్ల కాల్పులు జరిపిన సతీష్‌రెడ్డి
తప్పించుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి..
ఇరువర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి, సతీష్‌కు గాయాలు..
మహర్షి… pic.twitter.com/sksSA8k3eb
— greatandhra (@greatandhranews) January 2, 2026