Vijayawada Government Hospital: ఆంద్రప్రదేశ్ లో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. రోజుకో దారుణం వెలుగు చూస్తూనే ఉంది. దీంతో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ, దిశ లాంటి చట్టాలున్నా వారిని ఆదుకోవడం లేదు. ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. కీచకుల చెరలో బందీలుగా మారుతున్నాయి. కాలం కలిసి రాక బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మహిళల భవిష్యత్ అంధకారంలో పడుతోంది. అభాగ్యుల బాధలకు ఫుల్ స్టాప్ లేకుండా పోతోంది. తాజాగా విజయవాడలో చోటుచేసుకున్న ఘటన చూస్తే సిగ్గుతో తల దించుకోవాల్సిందే. వికలాంగురాలైన యువతిని ఉపాధి ఎరతో లొంగదీసుకుని శారీరకంగా హింసించడం సంచలనం సృష్టించింది.
ఈ దారుణంపై సీఎం జగన్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఎంతటి వారైనా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగురాలిపై ఇంతటి పైశాచికత్వానికి పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులేనన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందజేయాలని సూచించారు. విజయవాడ బాంబేకాలనీకి చెందిన దివ్యాంగురాలైన యువతిని సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారం చేసి అక్కడే బంధించాడు. దీంతో ఒప్పంద కార్మికులు గమనించి ఆమెపై వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు.
Also Read: KTR- BJP- Congress: రివర్స్ పంచ్: కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ కౌంటర్ అటాక్!
ఆమె కనిపించకుండా పోవడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మా అమ్మాయి సెల్ కు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పినా నిర్లక్ష్యం వహించారు. దీంతో విషయం సీరిమస్ కావడంతో శ్రీకాంత్ నెంబర్ ఆధారంగా ఆరా తీయగా ఆమెను ప్రభుత్వాసుపత్రిలో వదిలేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు అక్కడకు చేరుకునే సరికి ఒప్పంద కార్మికుడు పవన్ ఆమెపై లైంగిక దాడి చేస్తున్నాడు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనకు బాధ్యుడైన సీఐ, ఎస్సైని సస్పెండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. నిస్సహాయకురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణం. ఉపాధి కల్పిస్తామని చెప్పి శారీరకంగా లోబరుచుకోవడం పైశాచికమే. బలహీనతలను బలంగా చేసుకుని లైంగిక దాడికి తెగించడం చూస్తుంటే ఇంకారాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలియడం లేదు. అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? దివ్యాంగులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read:TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?
Recommended Videos: