https://oktelugu.com/

అమ్మాయిలూ జాగ్రత్త అన్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

ప్రస్తుత నడిస్తోంది కలియుగం.. ధర్మం ఒక్కపాదం మీదే నడుస్తోంది. ఇలాంటి సమాజంలో మహిళలు బ్రతుకడమే గగనం అయిపోతోంది. నిత్యం అమ్మాయిలపై మానభంగాలు.. మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల విషయంలో మన అనే వారిని కూడా నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా జీవించాల్సి వస్తోంది. ఇప్పుడున్న సమజంలో అమ్మాయిలు నిర్భయంగా బ్రతుకాలంటే ఏం చేయాలి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. Also Read:‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా? ఇటీవల కాలంలో అమ్మాయిలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 12:51 PM IST
    Follow us on

    ప్రస్తుత నడిస్తోంది కలియుగం.. ధర్మం ఒక్కపాదం మీదే నడుస్తోంది. ఇలాంటి సమాజంలో మహిళలు బ్రతుకడమే గగనం అయిపోతోంది. నిత్యం అమ్మాయిలపై మానభంగాలు.. మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల విషయంలో మన అనే వారిని కూడా నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా జీవించాల్సి వస్తోంది. ఇప్పుడున్న సమజంలో అమ్మాయిలు నిర్భయంగా బ్రతుకాలంటే ఏం చేయాలి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

    Also Read:‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా?

    ఇటీవల కాలంలో అమ్మాయిలు ఆన్ లైన్ స్నేహల పేరిట మోసపోతున్నారు. ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లకు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతోన్నారు. ఇలాంటి వారితోపాటు సమాజంలోని వారందరికీ అవగాహన కల్పించేలా హైదరాబాద్ సైబర్ క్రైమ్.. తెలంగాణ పోలీసులు ఓ వీడియోను రూపొందించారు. అమ్మాయిలు సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది ఈ వీడియోలో చూపించారు.

    హైదరాబాద్ పోలీసులు తరుచూ నేరాలు, ఘోరాలపై సెలబ్రెటీల సాయంతో జనాల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఓ మంచి పని కోసం హైదరాబాద్ పోలీసులతో చేతులు కలిపాడు. ఆన్ లైన్‌లో అపరిచితులతో స్నేహం చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తూ తారక్ ఒక వీడియో చేశాడు. ఎన్టీఆర్ మాట్లాడే ముందు ఇందులో ఓ కొన్ని సీన్స్ చూపించారు.

    ‘శ్వేత అనే అమ్మాయి తన గదిలో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తన స్నేహితురాలు ఆమె వద్దకు వచ్చి ఏమైందని అడుగుతుంది? తనకు ఫేస్ బుక్‌లో ఒక అబ్బాయితో పరిచయం అవుతాడు. ఆ తర్వాత వీరిద్దరి సాన్నిహిత్యం పెరుగుతుంది. అతడు ఆమెకు ప్రపోజ్ చేయగా అమ్మాయి ఓకే చెబుతుంది. ఈక్రమంలోనే ఆ యువతి నగ్న చిత్రాలు అడిగితే ఆమె పంపుతుంది. అయితే ఆ యువకుడు వాటిని పెట్టుకుని అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. దీంతో ఆ యువతీ తీవ్ర మానసిక వేదనకు గురికావడం ఈ వీడియోలో చూపించారు.

    Also Read: బిగ్ బాస్: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

    ఈ సీన్లన్నీ ముగిశాక ఎన్టీఆర్ ప్రత్యక్షమై ఆన్ లైన్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాడు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని.. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతాడు. గతంలో ఎన్టీఆర్ నటించినన ‘రాఖీ’.. ‘టెంపర్’ సినిమాల్లో అమ్మాయిలకు అండగా నిలిచే అన్నయ్య పాత్రల్లో నటించాడు. దీంతో అతడితో ఈ వీడియో చేయిస్తే అందరినీ ఆకట్టుకుంటుందనే ఆలోచనతోనే హైదరాబాద్ పోలీసులు ఎన్టీఆర్ తో ఈ వీడియో చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొత్త లుక్కులో కన్పించడంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.