Assembly Election: ఈనెల 20న జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రాంతాలలో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల జరిగే ఈనెల 20 వరకు విస్తృతమైన నిఘా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడికి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. నగదు తీసుకెళ్లే విషయంలో పరిమితి విధించింది. అయితే ఎన్నికల సంఘం విధించిన పరిమితిని దాటి నగదు తరలించే వారిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి భారీగా క్యాష్ స్వాధీనం చేసుకుంది. ఇలా ఇప్పటివరకు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో 1,082 కోట్ల సొత్తును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ సొత్తులో 181 కోట్ల నగదు, 119 కోట్ల విలువైన మద్యం, 123 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, 302 కోట్ల ఆభరణాలు, 354 కోట్ల విలువైన బహుమతులు ఉన్నాయి. ఇక సోమవారం నాటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ప్రలోభాలకు తెర లేచింది.
పోటాపోటీగా
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఝార్ఖండ్, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి, బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లకు వరాలు ప్రకటించాయి. అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రెట్టింపు స్థాయిలో అమలు చేస్తామని ఆశపెట్టాయి. పోటాపోటీగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. అయితే 20 తారీఖు పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. నేతలు డబ్బు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఒక్కో ఓటుకు 700 నుంచి 1000 చొప్పున పంచుతున్నారు. సున్నితమైన నియోజకవర్గాలలో మరింత ఎక్కువ స్థాయిలో డబ్బులు పంచుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీగానే డబ్బు పంచారు. అయితే ఆ రికార్డును ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు బ్రేక్ చేస్తున్నాయి. ఇక మంగళవారం నాడు భారీగానే డబ్బు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 24/7 అనేలాగా తనిఖీ కేంద్రాల వద్ద సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
గ్రామాలలో బెట్టింగ్ లు
డబ్బులు పంపిణీ మాత్రమే కాదు.. గ్రామాలలో బెట్టింగ్ల జోరు కూడా సాగుతోంది. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు? ఎంత మెజారిటీతో గెలుస్తారు? అనే అంశాల ఆధారంగా గ్రామాలలో బెట్టింగులు నడుస్తున్నాయి. నూటికి 500 చొప్పున బెట్టింగులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలలో బెట్టింగుల వ్యవహారం జోరుగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో తెలంగాణ వారు కూడా పాల్గొంటున్నారని సమాచారం.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రకు సరిహద్దులో ఉంటాయి. ఈ జిల్లాల వారికి మహారాష్ట్ర ప్రజలతో సంబంధం బాంధవ్యాలు ఉంటాయి. కొందరికి బంధుత్వాలు కూడా ఉంటాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Assembly election elections of maharashtra and jharkhand 1082 crore money seized by ec
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com