https://oktelugu.com/

అస్సాం-మిజోరాం మధ్య కాల్పులు- అసలు వివాదమేంటి?

సరిహద్దు వివాదాల్లో అస్సాం, మిజోరాం స్టేట్లు చిక్కుకున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నానుతున్న గొడవల కారణంగా ఇరు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకునే వరకు వెళ్లారు. శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను పెద్దది చేస్తూ ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసే విధంగా మారుస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నా చర్యలు మాత్రం ఆ దిశగా సాగడం లేదు. ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. అస్సాం, మిజోరాం […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2021 12:46 pm
    Follow us on

    Assam-Mizoram border clashసరిహద్దు వివాదాల్లో అస్సాం, మిజోరాం స్టేట్లు చిక్కుకున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నానుతున్న గొడవల కారణంగా ఇరు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకునే వరకు వెళ్లారు. శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను పెద్దది చేస్తూ ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసే విధంగా మారుస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నా చర్యలు మాత్రం ఆ దిశగా సాగడం లేదు. ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు.

    అస్సాం, మిజోరాం సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. రెండు ప్రాంతాల మధ్య జూన్ నుంచి తాజా వివాదం చెలరేగింది. ఐత్లాంగ్హనార్ అనే ప్రాంతాన్ని అస్సాం తమ ఆధీనంలోకి తీసుకుంది. అస్సాం భూభాగమైన ఆ ప్రాంతాన్ని మిజోరాం ఆక్రమించుకుందని ఆరోపించింది. మిజోరాంలోని మూడు జిల్లాలు ఐజ్వాల్, కోలాసిబ్, మమిత్ లు అస్సాంలోని కాచర్, కరీంగంజ్, హైలకంది జిల్లాలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. జూన్ 30న కొలాసిబ్ జిల్లాకు సమీపంలోని సరిహద్దు దాటి అస్సాం తమ భూభాగంలోకి చొరబడిందని మిజోరాం ఆరోపిస్తోంది. మిజోరామే అస్సాంలోని హైలకంది జిల్లాలోకి 10 కిలోమీటర్లు చొరబడిందని ఆరోపణలు చేస్తోంది.

    వాస్తవానికి రెండు ప్రాంతాల మధ్య వివాదానికి బ్రటిష్ కాలంలోనే బీజం పడింది. అంతకుముందు అస్సాం, మిజోరాం మధ్య వివాదాలు ఉండేవి కావు. అస్సాం, నాగాలాండ్ నివాసితుల మధ్య చోటుచేసుకున్న వివాదాల కంటే చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు 165 కిలోమీటర్ల మేర ఉంది. ఒకప్పుడు మిజోరాంను లుషాయ్ హిల్స్ ని పిలిచేవారు. అప్పుడు ఇది అస్సాం రాష్ర్టంలో ఒక జిల్లాగా ఉండేది. అయితే 1857లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్ ను చాచర్ ప్రాంతం నుంచి వేరు పడింది. ఆ తరువాత 1933లో లుషాయ్ హిల్స్ మణిపూర్ మధ్య ఓ సరిహద్దును తీసుకొస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో మిజోరాం వాసులు అంగీకరించలేదు.

    స్వాతంత్ర్యం అనంతరం ఈశాన్య భారతంలో స్టేట్ల ఏఱా్పటు చేశారు. నాగాలాండ్ (1963), అరుణాచల్ ప్రదేశ్ (1972), మేఘాలయ(1972), మిజోరాం(1972) ఏర్పాటయ్యాయి. అస్సాం, మిజోరాం మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉమ్మడి సరిహద్దు వద్ద స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని నిర్ణయించాయి. 2018 ఫిబ్రవరిలో మిజెో జిర్లాయ్ పాల్ అనే విద్యార్థి సంఘం మిజోరాం రైతుల కోసం అస్సాం భూభాగంలో ఒక రెస్ట్ హౌస్ నిర్మించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అస్సాం పోలీసులు దాన్ని కూల్చివేశారు. గతేడాది అక్టోబర్ లో ఒకే వారంలో రెండు సార్లు హింస చెలరేగింది. అస్సాంలోని లైలాపూర్ లో ఓ నిర్మాణం చేపట్టడంతో మిజోరాం భగ్గుమంది.

    ప్రస్తుతం పరిస్థితి హింసాత్మకంగా కనిపిస్తోంది. తమ భూభాగంలోకి చొచ్చుకుని వస్తోందంటూ మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగ అమిత్ షాకు అదే సమయంలో ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేశారు. కొందరు ఆందోళనకారులు కర్రలు పట్టుకుని మిజోరాం భూభాగంలోకి రావడం, అస్సాం పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జిలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. మిజోరాం స్థానికులే రాళ్లు రువ్వుతున్నారని అస్సాం పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఇరు ప్రాంతాల్లో సరిహద్దు సమస్య పరిష్కరించాలని అస్సాం సీఎం హిమాంత బిశ్వ కర్మ, మిజోరాం సీఎం జోరాంతంగా కేంద్రాన్ని కోరుతున్నారు.