https://oktelugu.com/

ఇది విన్నారా.. అసదుద్దీన్ నోటా లౌకికవాదం..!

నీతులు అనేవి పక్కవాడికి చెప్పేందుకే.. తాము ఆచరించడానికి కాదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి నిరూపించారు. దేశ ప్రజలు, ప్రపంచమంతా అయోధ్య రామాలయ భూమిపూజపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఈ నేత మాత్రం లాకౌకవాదం.. సెక్యూరిజం ముసుగులో తన అభిష్టాన్ని దేశప్రజలపై రుద్దే యత్నం చేస్తున్నారు. భారతమాత జై.. అనని వాళ్లు కూడా సెక్యూరిజంపై పతివ్రత మాటలు మాట్లాడడం విడ్డూరంగా మారింది. Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా దేశ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 6, 2020 7:09 pm
    Follow us on


    నీతులు అనేవి పక్కవాడికి చెప్పేందుకే.. తాము ఆచరించడానికి కాదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి నిరూపించారు. దేశ ప్రజలు, ప్రపంచమంతా అయోధ్య రామాలయ భూమిపూజపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఈ నేత మాత్రం లాకౌకవాదం.. సెక్యూరిజం ముసుగులో తన అభిష్టాన్ని దేశప్రజలపై రుద్దే యత్నం చేస్తున్నారు. భారతమాత జై.. అనని వాళ్లు కూడా సెక్యూరిజంపై పతివ్రత మాటలు మాట్లాడడం విడ్డూరంగా మారింది.

    Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

    దేశ ప్రధానిగా ఉన్న మోదీ ఒక మతానికి చెందిన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు.. ప్రధాని అన్న మతాలను సమానంగా చూడాలి కదా అంటూ లాజికులను తీస్తున్నారు. మోదీ హిందుత్వ శక్తులకు ఊతమిస్తున్నాడనే ఆలోచనను మైనార్టీ వర్గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది. దేశ ప్రధానికి అన్ని మతాలకు సమానం అందరూ ఒప్పుకోవాల్సిందే.. అయితే ఐఎంఐ లాంటి మతపార్టీ.. అందులోనూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నోటి వెంట నుంచి సెక్యూరిజం మాటలు రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    భారతమాత కీ జై.. అనడం.. అనకపోవడం ఆయన వ్యక్తిగత విషయమే అయినా ఆయన వ్యవహర శైలి మైనార్టీలపట్ల, ఇతర మతస్థుల పట్ల ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. లాకౌకవాదం.. సెక్యూరిజంపై లెక్చర్లు దందే అసరుద్దీన్ ఇతర మతస్థుల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడైనా ప్రవర్తించారనేది ఆలోచించుకోవాలి. ఎంతసేపు మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం హిందుత్వ బూచిని చూపెడుతూ పబ్బం గడుపుకోవడమే సరిపోతుందనే వాదనలు ఉన్నాయి. పాతబస్తీకే పరిమితమై ఓ పార్టీ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నేతలకు కౌంటర్ ఇవ్వడం హస్యాస్పదంగా మారిందనే టాక్ విన్పిస్తుంది.

    Also Read: కేసీఆర్.. మళ్లీ అదే మాజిక్ రిపీట్ చేశాడా?

    అసదుద్దీన్ ఓ వర్గం హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పులేకపోయినా.. రామాలయం పూజ నాడు.. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని.. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శంగా కన్పిస్తుంది. బాబ్రీ మసీదు నిర్మాణానికి కేంద్రం కూడా సాయం అందిస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం మైనార్టీలను ఆకట్టుకునేందుకేనని స్పష్టమవుతోంది.

    అసదుద్దీన్ ఇప్పటికైనా ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తూనే.. తమ వర్గం వారి కోసం పోరాడాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే మైనార్టీలు కూడా ఎంఐఏం పార్టీని చీదరించుకునే రోజులు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా అసదుద్దీన్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!