https://oktelugu.com/

కరోనాను బొక్కలో వేయొచ్చు కదా?

ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కరోనాను కట్టడి చేసే చర్యలను విస్మరించి దాని గురించి మాట్లాడే వారిపై కేసులు పెట్టే వరకు వెళ్తున్నారు. దీంతో అందరిలో భయం నెలకొంది. ఏం మాట్లాడితే ఎటొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఎంతటి వారినైనా సరే కేసులు పెడతామని భయపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన నేతలు పరధ్యానంగా ఉంటున్నారని తెలుస్తోంది. మంత్రులు సైతం అదే బాటలో.. ఏపీలో మంత్రులు సైతం […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 9, 2021 / 09:25 AM IST
    Follow us on

    ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కరోనాను కట్టడి చేసే చర్యలను విస్మరించి దాని గురించి మాట్లాడే వారిపై కేసులు పెట్టే వరకు వెళ్తున్నారు. దీంతో అందరిలో భయం నెలకొంది. ఏం మాట్లాడితే ఎటొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఎంతటి వారినైనా సరే కేసులు పెడతామని భయపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన నేతలు పరధ్యానంగా ఉంటున్నారని తెలుస్తోంది.

    మంత్రులు సైతం అదే బాటలో..
    ఏపీలో మంత్రులు సైతం నాయకులను భయపెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. కరోనా గురించి మాట్లాడితే ఊరుకోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తికి కారణం ప్రభుత్వాలే అని ప్రజలు పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడితే బొక్కలే పెడతామని బెదిరిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులనే విషయం మాత్రం మరిచారు.

    అసలేం జరుగుతోంది
    ఏపీలో అసలేం జరుగుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని తెలుస్తోంది. విధాన పరమైన నిర్ణయాలతో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారపక్షం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుందని తెలుస్తోంది. ఇందు కోసమే కరోనా గురించి బాహాటంగా ప్రకటనలు చేస్తే అంతేనని భయపెడుతున్నారు.

    నియంత్రణ పద్ధతి ఇదేనా?
    ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలి. అంతే కాని నియంత పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల స్వేచ్ఛను హరిస్తూ వాటిని తక్కువ చేసి చూడడం భావ్యం కాదని పలువురు విమర్శిస్తున్నారు. రాజకీయాలంటే విలువలుండాలి కాని నీచంగా ప్రవర్తించకూడదు. అందరి ఆత్మాభిమానాలకు విలువ ఇస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నారు.