Arnab Goswami Viral Video: జర్నలిస్టులు విషయం తోనే ప్రాచుర్యంలోకి రావాలి అంటారు.. కానీ కొంతమంది విషయ పరిజ్ఞానంతో పాటు, గొంతును కూడా జత చేస్తారు. వాక్యాడంబరం, వాగాడంబరం వారికి ఉంటుంది కాబట్టి దుమ్ము రేపుతారు. ఇటువంటి పాత్రికేయులలో రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అర్నబ్ గోస్వామి ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా దేశ ప్రయోజనాల విషయంలో.. జాతీయత భావన విషయంలో గోస్వామి ఏమాత్రం వెనక్కి తగ్గడు. పైగా ఆ సమయంలో తను ఒక పాత్రికేయుడు అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోతాడు. కేవలం భారతీయతను మాత్రమే ప్రదర్శిస్తాడు. అది అతడిలో ఉన్న టెంపర్ మెంట్. దీనిపై ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ అతడు వెనక్కి తగ్గడు. వెనక్కి తగ్గే అవకాశాన్ని కూడా ఇవ్వడు.
రిపబ్లిక్ టీవీలో బిజెపికి అనుకూలంగా వార్తలు ప్రసారం అవుతాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాలలో బిజెపి చేసిన తప్పులను అర్నబ్ బయటపెడుతుంటాడు. మొహమాటం లేకుండా బీభత్సమైన కథనాలను ప్రసారం చేస్తుంటాడు. వాస్తవానికి జర్నలిస్టుకు భయం ఉండకూడదని చెబుతుంటారు. అయితే నేటి కాలంలో అలాంటి పాత్రికేయులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో అర్నబ్ కచ్చితంగా మొదటి స్థానంలో ఉంటాడు. ఫియర్లెస్ జర్నలిజాన్ని ప్రదర్శించడంలో అతడు ఎప్పటికీ శిఖర భాగంలో ఉంటాడు.
కేంద్రం తీసుకొచ్చిన ఎన్ సీ ఆర్ మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తోంది. ముస్లిం సామాజిక వర్గంలో కొంతమంది దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన వ్యక్తులు వారి వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం ఎన్ సి ఆర్ లో స్పష్టం చేసింది. కానీ దీనిని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, కొంతమంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్ మీద రిపబ్లిక్ టీవీలో అర్నబ్ ఒక చర్చ వేదిక నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముస్లిం నేతలను ఆహ్వానించాడు. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానాన్ని కొంతమంది ముస్లింలు సమర్ధిస్తుంటే.. మిగతా కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు. డిబేట్లో ఎవరి వాదనలు వారు వినిపించారు.
ఇదే సమయంలో ఇద్దరు ముస్లింలు కేంద్రం తీసుకొచ్చిన విధానాన్ని వ్యతిరేకించారు. అంతే కాదు అర్నబ్ గోస్వామిని కూడా తిట్టారు. ఈ నేపథ్యంలో అతడు కూడా వారికి అదే స్థాయిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఒకరకంగా తను ఒక జర్నలిస్టు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. జాతీయత భావాన్ని పూర్తిగా నింపుకొని.. ఎన్ సి ఆర్ ను వ్యతిరేకించే వారిని తూర్పారబట్టాడు. ఒక ఛానల్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండి కూడా.. ఇలాంటి డేరింగ్ వ్యాఖ్యలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని మీడియా సంస్థలు ముస్లిం సామాజిక వర్గంలో తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తుంటాయి. చివరికి వారి పేర్లను కూడా చదవడానికి ఒప్పుకోవు. అలాంటిది గోస్వామి.. రిపబ్లిక్ టీవీ కి యజమాని అయినప్పటికీ కూడా.. తన జాతీయత భావంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
BIG FIGHT BETWEEN ARNAB GOSWAMI & MAULANAS.
Sanatani Muslim Faiz Khan to Maulana: You are a Rohingya & Show your ID live on TV https://t.co/qe8Z4Rj0z8 pic.twitter.com/2I3r9jbM2p
— Bhakt Prahlad (@RakeshKishore_l) December 27, 2025