రఘురామ కేసులో వాదప్రతివాదనలు

ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో వాదనల సందర్బంగా అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత అభ్యంతరం తెలిపారు. ఆయన వాదనలు ధిక్కారపూరిత స్వభావమైనవిగా చెబుతున్నారు. ఏఏజీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ కు సిఫారసు చేయడానికి ఇది సరైన కేసు అన్నారు. న్యాయస్థానం ఉదారత చూపుతూ ప్రస్తుతం అలాంటి చర్యలకు ప్రతిపాదించడం లేదన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే […]

Written By: Srinivas, Updated On : May 23, 2021 2:13 pm
Follow us on

ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో వాదనల సందర్బంగా అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత అభ్యంతరం తెలిపారు. ఆయన వాదనలు ధిక్కారపూరిత స్వభావమైనవిగా చెబుతున్నారు. ఏఏజీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ కు సిఫారసు చేయడానికి ఇది సరైన కేసు అన్నారు. న్యాయస్థానం ఉదారత చూపుతూ ప్రస్తుతం అలాంటి చర్యలకు ప్రతిపాదించడం లేదన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే ఉపేక్షించేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే సీఐటీ అదనపు డీజీ సునీల్ కుమార్, మంగళగిరి సీఐడీ ఎన్ హెచ్ వో, ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు నిర్దేశించిన సమయంలో నివేదిక పంపడంలో విఫలమైన మెడికల్ బోర్డు చైర్మన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై సుమోటాగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ధర్మాసనం రిజిష్ర్టార్ జ్యుడిషియల్ ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం 19న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు వేర్వేరుగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు వెలుగులోకి వచ్చాయి.

ఎంపీ రఘురామ కృష్ణం రాజు రిమాండ్ కు హాజరుపర్చిన సందర్భంగా గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు ఈనెల 15న వాంగ్మూలం ఇచ్చారు. ఎంపీ కాలికి అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో ఆయన తరఫు న్యాయవాది అదే రోజు సాయంత్రం హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని వ్యాజ్యంగా తీసుకున్న హైకోర్టు ఈనెల 15న అత్యవసరంగా విచారణ జరిపింది. ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వమించి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డును ఆదేశించింది. 16న మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 16న సాయంత్రం 6.30 గంటలకు నివేదిక హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు కస్టడీలో ఉండగా సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపీ చెప్పిన నేపథ్యంలో జీజీహెచ్ తో పాటు గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని మే 15న గుంటూరు మెజిస్ర్టేట్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, లలితతో కూడిన ధర్మాసనం 19న వ్యాజ్యంపై విచారణ జరిపింది. రమేశ్ ఆస్పత్రిలో ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ మెజిస్ర్టేట్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశారా అని అదనపు ఏజీ సుధాకర్ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది.

కస్టడీలో ఎంపీని కొట్టారని, నడవలేని స్థితిలో ఉన్నారని, సంబంధిత ఫొటోలను చూడాలని లేఖ అందిన సందర్భంలో హైకోర్టు న్యాయ తలుపులు మూసుకుని ఉండలేదు. నిందితులకు సైతం హక్కులుంటాయి. వాటిని రక్షించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఉంటుంది. నిందితుల హక్కులకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తే వారి హక్కులు కాపాడేందుకు న్యాయస్థానం సిద్ధంగా ఉంటుంది. నిందితుడు ఎంపీనా, సాధారణ వ్యక్తా అనే విషయంలో న్యాయస్థానానికి పట్టింపులు ఉండవు. రాష్ర్ట ప్రభుత్వం చె బుతున్న కారణాలు కోర్టును ఒప్పించేవిగా లేవు. రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చాం. రాత్రి 11 గంటలకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం సాధ్యం కాలేదనుకున్నా మరుసటి రో జు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చే వరకు ఎందుకు అమలు చేయలేదు? ఏఏజీ వాదన అంతా హైకోర్టు ఇచ్చింది.

అధికారులపై సుమోటో కోర్టు ధిక్కరణ కేసు ప్రారంభించే విషయంలో జస్టిస్ లలిత అభిప్రాయాలతో అంగీకరిస్తున్నామని జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. వాదనల సందర్బంగా ఏఏజీ కొంత నియంత్రణ పాటించాలి. కోర్టులో జరిగే వాదోపవాదాల్లో నియంత్రణ పాటించడం ప్రామాణికమన్నారు. వాదనల్లో పదప్రయోగం తగిన విధంగా ఉండాలన్నారు. కోర్టులో జరిగే విచారణలో ఏఏజీ హుందాతనంగా వ్యవహరించాలని సూచించారు.