https://oktelugu.com/

మూడు రాజధానులు తేలేలా లేదే?

జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఇప్పట్లో అమల్లోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉండగా.. ఇప్పట్లో ఈ అంశం తేలేల లేదు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్న విధంగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు కూడా బ్రేక్‌ పడినట్లయింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా.. లెక్కకు మించి పిటిషన్లు పడటంతో సమయం పట్టేలా కనిపిస్తోంది. Also Read: ఒక్క వర్షం.. పదుల […]

Written By: , Updated On : October 17, 2020 / 10:02 AM IST
Follow us on

amara

జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఇప్పట్లో అమల్లోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉండగా.. ఇప్పట్లో ఈ అంశం తేలేల లేదు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్న విధంగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు కూడా బ్రేక్‌ పడినట్లయింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా.. లెక్కకు మించి పిటిషన్లు పడటంతో సమయం పట్టేలా కనిపిస్తోంది.

Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..

గతేడాది జనవరిలో జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేశారు. శాసనమండలిలో ఒకసారి తిరస్కరిస్తే మరోసారి ప్రవేశపెట్టి గవర్నర్ చేత ఆర్డినెన్స్ పై సంతకాలు చేయించారు. దీంతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు చట్ట రూపాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే న్యాయపరమైన చిక్కులే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

మరోవైపు మూడు రాజధానుల కోసం జగన్‌ ముహూర్తాలు కూడా ఖరారు చేయించారు. చివరగా దసరా వరకైనా విశాఖలో పరిపాలన రాజధాని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ.. పండుగకు మరో పది రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో హైకోర్టులో పిటిషన్లు కొట్టివేసి క్లియరెన్స్‌ ఇచ్చేలా లేదు. దాదాపు వందకుపైగా పిటిషన్లు, అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం విచారించాల్సి ఉంది. దీనికి తోడు తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే పరిపాలన రాజధాని, న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతం నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మరికొన్ని పిటిషన్లు వేశారు.

Also Read: కులాలకు చెల్లు.. జగన్ మరో సంచలన నిర్ణయం

అటు హైకోర్టు స్టే ఉత్తర్వులు కూడా తొలగించకపోవడంతో మరోసారి సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించక తప్పేలా లేదు. ఇలా కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తోందని మరోవైపు వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమరావతి అంశం మోకాలడ్డుతున్నట్లే కనిపిస్తోంది.