విశాఖ వెళ్లడానికి ఉద్యోగులు సిద్ధమేనా..?

ఏపీ సీఎం జగన్ మనసులో మూడురాజధానులు ఉన్న విషయం తెలిసిందే. త్వరలో వీటీలో ఒకదానికి ముహూర్తం పెడుతున్నాడట. ఇప్పుడున్న అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులను చేయాలన్న జగన్ ప్రయత్నాన్ని త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన జెండా పండుగను విశాఖలో జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే జగన్ విశాఖలో అడుగుపెడుతున్నాడంటే ఆయన ఒక్కరే వెళ్లడం కాదు.. ఆయనతో పాటు ఉద్యోగులు కూడా వెళ్లాల్సిందే. ఈ తరుణంలో ఉద్యోగుల మనసులో ఏముందంటే..? ఆంధ్రప్రదేశ్ […]

Written By: NARESH, Updated On : June 24, 2021 10:46 am
Follow us on

ఏపీ సీఎం జగన్ మనసులో మూడురాజధానులు ఉన్న విషయం తెలిసిందే. త్వరలో వీటీలో ఒకదానికి ముహూర్తం పెడుతున్నాడట. ఇప్పుడున్న అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులను చేయాలన్న జగన్ ప్రయత్నాన్ని త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన జెండా పండుగను విశాఖలో జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే జగన్ విశాఖలో అడుగుపెడుతున్నాడంటే ఆయన ఒక్కరే వెళ్లడం కాదు.. ఆయనతో పాటు ఉద్యోగులు కూడా వెళ్లాల్సిందే. ఈ తరుణంలో ఉద్యోగుల మనసులో ఏముందంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అమరావతిని రాజాధానిగా ప్రకటించిన చంద్రబాబు తెలంగాణ నుంచి ఉద్యోగులను రప్పించడానికి తాయిలాలు ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక ఫ్లాట్ కేటాయించి వారికి అప్పజెప్పారు. అయతే అప్పుడు ప్లాట్లు పొందిన ఉద్యోగులు చంద్రబాబును కాదని జగన్ ను గెలిపించుకున్నారు. అయితే ప్రస్తుతం జగన్ చేస్తున్న కొన్ని విధానాలకు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జగన్ పరిపాలనను విశాఖకు తరలించే యోచనలో ఉన్న తరుణంలో ఉద్యోగులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇన్ని రోజులు అమరావతిలో స్వేచ్ఛగా పనిచేసుకున్న వారు ఉన్న ఫలంగా తమ ఆస్తులను విడిచి విశాఖకు తరలివెళ్లడమంటే మళ్లీ కొత్తపాటేనా..? అన్న విధంగా ఆలోచిస్తున్నారట. ఇన్ని రోజులు తమ ప్లాట్లకు కొంచెం డిమాండ్ ఉంటుందని ఆలోచించిన వారు ఇప్పుడు విశాఖకు తరలుదామంటే సిద్ధమవ్వడానికి ముందకు రావడం లేదట.

ఇదీ కాగా పీఆర్సీ గురించి జగన పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఫీలవుతున్నారట. ఇప్పటికీ 11వ పీఆర్సీనీ జగన్ ఆమోదించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉద్యోగులకు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదట. దీంతో ఇప్పటికిప్పుడు విశాఖ వెళ్లి పనిచేయాలంటే ఏదో కొంత వెలితి ఉందని కొందరు వాపోతున్నారు.