Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..?

Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..? ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదంతో త్వరలో యుద్ధ వాతావరణం నెలకొందా..? ఉక్రెయిన్ సరిహద్దులో భారీగా రష్యాకు చెందిన సైనికుల మోహరింపుపై ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ప్రారంభంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిచేసే అవకాశం ఉందని తెలుపుతోంది. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధం యూరప్ దేశాలపై ప్రభావం చూపనుందని అంటోంది. ఈ నేపథ్యంలో అసలు రష్యా, ఉక్రెయిన్ల […]

Written By: NARESH, Updated On : December 14, 2021 3:05 pm
Follow us on

Russia-Ukraine war: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్లు ఆజ్యం పోస్తున్నాయా..? ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదంతో త్వరలో యుద్ధ వాతావరణం నెలకొందా..? ఉక్రెయిన్ సరిహద్దులో భారీగా రష్యాకు చెందిన సైనికుల మోహరింపుపై ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ప్రారంభంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిచేసే అవకాశం ఉందని తెలుపుతోంది. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధం యూరప్ దేశాలపై ప్రభావం చూపనుందని అంటోంది. ఈ నేపథ్యంలో అసలు రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎందుకు రాబోతుంది..? ఒకప్పుడు రష్యాలో అంతర్భూభాగంగా ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు ఆ దేశంపై ఎందుకు తిరగబడుతోంది..? అన్న వివరాలు చూద్దాం..

Russia-Ukraine war

రష్యాలో అంతర్భూభాగాన్ని పంచుకున్న ఉక్రెయిన్ 1991లో సోవియట్ యూనియన్ రద్దు చేసిన తరువాత ఆ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి రష్యా నుంచి వేరుగా ఉండేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని, ఆ దేశాలతో సాన్నిహిత్యంగా ఉంటోంది. అయితే 2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విక్టర్ యనుకోవిచ్ రష్యాతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. దీంతోదేశ వ్యాప్తంగా నిరసనలు రావడంతో ఆయన 2014లో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రష్యా అక్కడి ఉక్రెయిన్ వేర్పాటు వాదులతో కలిసి ఆ దేశంపై దాడి చేసింది.

నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్)లో ఉక్రెయిన్ చేరకుండా ఉండేందుకే రష్యా ఈ వ్యూహాన్ని అవలంభిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇస్తే తమ దేశ సరిహద్దుల్లో నాటో స్థావరాలు బలపడుతాయని దీంతో రష్యాపై పెద్ద దెబ్బ పడుతుందని భయపడుతోందని అంటున్నారు. కానీ నాటో వల్ల ఎలాంటి ముప్పు ఉండదని ఇప్పటికే హామీ ఇచ్చింది. కానీ ఈ రెండు దేశాల మధ్య తరుచూ వివాదం నెలకొనడంతో నాటో సభ్యత్వ సమస్యే కారణమని భావిస్తున్నారు. 2014లో ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది.

అయితే ఉక్రెయిన్ వేర్పాటు వాదులతో క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో వారికి రష్యా డబ్బు, ఆయుధాలు సాయం చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కానీ ఈ ఆరోపణను రష్యా కొట్టవేస్తోంది. ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న డాన్ బాస్ నగరం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి ప్రాంతం. 2014లో జరిగిన యుద్ధంలో ఇక్కడ 14,000 మందికిపై మరణించారు. దీంతో 2015లో రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందానికి ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తిత్వం వహించాయి. దీంతో యుద్ధం ఆగిపోయింది. కానీ రాజకీయ సమస్య పరిష్కారం కాలేదు.

Also Read: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?
ఈ సంవత్సరం ప్రారంభంలో రష్యా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని ఉక్రెయిన్ అంటోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.అయితే ఏప్రిల్ లో బలగాల్లో కొందరిని వెనక్కి పంపించడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నా.. తాజాగా సరిహద్దుల్లో 90,000మంది సైనికును రష్యా మోహరిపంచిందని ఉక్రెయన్ అంటోంది.రష్యాలోని యెల్నాయ నగరానికి సమీపంలో 41వ ఆర్మీకి చెందిన యూనిట్ పాగా వేసిందని అంటోంది. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి కేవలం 260 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని తెలుపుతోంది.

అయితే బలగాల మోహరింపునకు కారణం 2015లో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపిస్తోంది. పాశ్చాత్య దేశలపై ఉక్రెయిన్ ఒత్తిడి తీసుకురాలేదని అంటోంది. తిరుగుబాటుదారులకు క్షమాభిక్ష ప్రకటించి, స్వతంత్రం ఇవ్వాలని ఒప్పందంలో భాగమని, కానీ ఉక్రెయిన్ దానిని పాటించలేదని రష్యా అంటోంది. మరోవైపు ఇది అమలు కాకపోవడానికి రష్యానే కారణమని ఉక్రెయిన్ అంటోంది. అయితే చివరికి ఈ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొంటారోనిన రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Also Read: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?