Apple : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దని సూచించడం సంచలనం అయింది. అయితే, యాపిల్ మాత్రం ట్రంప్ మాటలను లెక్కచేయకుండా, భారత్‌తో తమ ఒప్పందం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దని, “వాళ్ళు తమను తాము చూసుకోగలరు” అని అన్నారు.
Also Read : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రూకాలర్‌కు పోటీగా ఆపిల్ కొత్త యాప్!
“భారత్‌లో యాపిల్ తయారీ కేంద్రాలు నిర్మించడంలో మాకు ఆసక్తి లేదని టిమ్ కుక్‌తో చెప్పాను. వాళ్ళు తమను తాము చూసుకోగలరు మీరు ఇక్కడే (అమెరికా) ఉత్పత్తిని పెంచండి” అని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. టిమ్ కుక్‌ను భారత్‌లో పెట్టుబడుల అన్వేషణను మానుకోవాలని, బదులుగా అమెరికాలోనే కొనసాగాలని ఆయన కోరారు. అయితే, సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, యాపిల్ నాయకత్వం మాత్రం భారత్‌తో ఒప్పందం విషయంలో స్థిరంగా ఉంది. తన స్టాండ్ మీదే నిలబడింది. ట్రంప్ మాటలను లెక్కచేయకుండా తమ తయారీ కేంద్రాలు దేశంలో యథావిధిగా కొనసాగుతాయని.. అందులో ఎటువంటి మార్పు ఉండదని భారత్ కు హామీ ఇచ్చింది.
ట్రంప్ సూచనలను పట్టించుకోకుండా, దేశంలో తమ పెట్టుబడులు, తయారీ సౌకర్యాలలో ఎటువంటి మార్పు ఉండదని యాపిల్ భారత్‌కు స్పష్టం చేసింది. భారత్ నుంచి వైదొలగాలన్న ట్రంప్ సలహాను యాపిల్ గట్టిగా తిరస్కరించినట్లుగా దీన్ని పరిగణించవచ్చు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా యాపిల్‌కు అనుకూలమైన ఎంపికగా కనిపించని సమయంలో.. యాపిల్ భారతదేశంలో తమ అవకాశాలను చురుకుగా అన్వేషిస్తోంది. ఇక్కడ తమ భారీ తయారీ వ్యాపారం కోసం భారత్ అతి తక్కువ సుంకాలను అందిస్తున్నట్లు సమాచారం.ఈ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపలేవని స్పష్టంగా తెలుస్తోంది. యాపిల్ తాజా అంతర్గత అంచనాలతో ఇది నిజమని తేలింది.
యాపిల్, భారత్‌లో ఐఫోన్ తయారీని వేగవంతం చేయడానికి భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, కంపెనీ ఇక్కడ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కింద యాపిల్, భారతదేశంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా పొందుతోంది. యాపిల్ ఈ నిర్ణయం భారతదేశం ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read : యాపిల్ కేరాఫ్ ఇండియా.. ఇక అన్ని ఫోన్లు ఇక్కడే!