ABN Radhakrishna: గత రెండు, మూడు రోజులుగా ఏపీలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అది కూడా ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే గురించి. జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో రీసెంట్ గా సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా.. ఆయన ఇంటికి ఆర్కే వచ్చారని, ఆయన సీఐడీ పోలీసులను అడ్డుకున్నారనే ప్రచారం బాగా జరిగింది. అయితే దీని మీద ఆర్కే ఘాటుగా రిప్లై ఇస్తూ వస్తున్నారు. తన మీద కక్ష పూరితంగా ఓ వర్గం మీడియా వార్తలు రాస్తూ వస్తోందని, తాను ఒకవేళ సీఐడీ పోలీసులను అడ్డుకుంటే మాత్రం వారు ఊరుకుంటారా.. కేసులు పెట్టేవారు కదా అంటూ ఆర్కే గట్టిగానే రిప్లై ఇచ్చారు. అయితే దీని మీద కాస్త ఆలస్యంగా అయినా సీఐడీ పోలీసులు యాక్షన్ చూపించారు.

విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి, ఆ కాపీలను హైదరాబాద్ సిటీకి పంపించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఉంటున్న లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరిగినప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి.. ఇక్కడే కేసు నమోదు చేయాలంటూ కాపీలను ఇక్కడకు పంపించారు పోలీసులు. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. సోదాలు జరిగినప్పుడు ఆర్కే వివాదం సృష్టిస్తే.. ఇక్కడే కేసు పెట్టాలి గానీ.. తీరిగ్గా విజయవాడ వెల్లాక పెట్టడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు.
సోదాలు జరిగిన 36 గంటల తర్వాత ఇలా కంప్లయింట్ ఇవ్వడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. నిజానికి లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించిన వీడియోలు చూస్తే ఇందులో ఎక్కడా ఆర్కే సీఐడీ పోలీసులను అడ్డుకున్నట్లుగా లేదని చాలా మందికి తెలిసినా.. ఏదో ఒక రకంగా ఆర్కే మీద కేసు పెట్టాలనే ప్రభుత్వ పెద్దల ఆలోచనకు ఇది ఒక ఛాన్స్ గా మారిందని అని తెలుస్తోంది. ఇక ఈ కేసు కోర్టులో తేలిపోయినా కూడా వైసీపీ పెద్దల టార్గెట్ ప్రకారం కేసు పెట్టేశామని సంబుర పడవచ్చు.
Also Read: Pawan on Movies: పంతానికి వస్తే నా సినిమాలు ఫ్రీగా ఆడిస్తా.. జగన్ సర్కార్ పై పవన్ సంచలన సవాల్
ఏపీలో గత రెండున్నరేండ్లుగా చాలామంది విషయంలో ఇలాంటివే జరుగుతున్నాయి. ఇప్పటికే సీఐడీ పోలీసులను వైసీపీ వారు ఎలా వాడుకుంటారో అందరికీ తెలుసు. ఇప్పుడు రాధాకృష్ణ విషయంలో కూడా ఇలాంటి వ్యూహవే అమలు చేశారు. మొత్తానికి జగన్ ప్లాన్ ప్రకారం.. రాధాకృష్ణపై ఓ కేసు అయితే నమోదయిందన్న మాట. ఇలా ఆర్కేనే తన మీద కేసు పెట్టే ఛాన్స్‌ను ఇచ్చారని చెబుతున్నారు చాలామంది.
Also Read: Pawan Kalyan: చేతగాని వైసీపీ మనకు అవసరమా? విశాఖ ‘ఉక్కు’ మంటలు వైసీపీపై రాజేసిన పవన్