జెండాలు మోసిన వారే.. ఎజెండాపై అలకబూనారు

ఎన్నో కష్టాలు.. మరెన్నో ఇబ్బందులు.. ఇంకెన్నో అవమానాల మధ్య జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. బంపర్ మెజార్టీతో ఆయన ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 151 సీట్లు సాధించి అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును మట్టికరిపించారు. అయితే.. అధికార పార్టీలో పైకి అంతా బాగానే ఉన్నా.. లోపల మాత్రం పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నామొన్నటి వరకు వైసీపీ జెండా మోసిన వారంతా ఇప్పుడు కాడెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చాలా చోట్ల […]

Written By: Srinivas, Updated On : April 11, 2021 10:45 am
Follow us on


ఎన్నో కష్టాలు.. మరెన్నో ఇబ్బందులు.. ఇంకెన్నో అవమానాల మధ్య జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. బంపర్ మెజార్టీతో ఆయన ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 151 సీట్లు సాధించి అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబును మట్టికరిపించారు. అయితే.. అధికార పార్టీలో పైకి అంతా బాగానే ఉన్నా.. లోపల మాత్రం పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్నామొన్నటి వరకు వైసీపీ జెండా మోసిన వారంతా ఇప్పుడు కాడెత్తుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలకు.. సీనియర్‌‌ నేతలకు కార్పొరేషన్‌ పదవులు అంటూ ఎరవేశారు. అయితే.. చివరి నిమిషంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మార్చేశారు. తమకు అనుకూలంగా ఉన్న వారికే నామినేటెడ్‌ పదవులు అప్పజెప్పారు. మరీ ముఖ్యంగా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పదవుల పందేరం చేసినట్లుగా టాక్‌. దీంతో ఇప్పుడు ఆ సీనియర్లలో కోపం కట్టలు తెచ్చుకుంటోందట. తమను కాదని మరొకరికి కార్పొరేషన్‌ పదవులు ఇవ్వడంతో కోపంతో ఉన్నారు.

జగన్‌ పార్టీ కోసం కష్టపడిన తమను కాదని.. తమను పక్కన పడేయడమే కాకుండా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మిన్నకుండి పోయారని నిరుత్సాహంలో ఉన్నారు. కనీసం వారు చెప్పినా కూడా వినిపించుకోవడం లేదని అంటున్నారు. దీంతో అప్పటివరకు పదవులపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలందరూ ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడికక్కడ గుంభ‌నంగా ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు, పార్టీ జెండా మోసేందుకు అజెండాను న‌డిపించేందుకు కూడా వారు విముఖ‌త వ్యక్తం చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే.. ఇప్పుడు ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తోంది. ప‌నిచేసిన వారిని, చేయ‌ని వారిని.. వైసీపీ‌కి ఉపయోగ‌ప‌డుతున్న వారిని, పార్టీని ఉప‌యోగించుకుంటున్న వారిని కూడా ఒకే విధంగా చూడ‌డాన్ని నాయ‌కులు త‌ప్పుబ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్కడిక‌క్కడ నాయ‌కులు పార్టీకి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. అలా అని వీరు పార్టీని వదిలిపెట్టే టైపు కాకుండా.. పార్టీలోనే ఉంటూ.. పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం.