Rain Update: అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నా వాతావరణ శాఖ మాత్రం చల్లని కబురు చెబుతోంది. రాగల రెండు మూడు రోజుల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడాన జల్లులు కురిసే వీలుందని తెలుస్తోంది. ఎండాకాలంలో కురిసే వానల్లో వడగళ్లు పడే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: AP CM Y S Jagan: ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చిన కోర్టు..
అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. దీంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, యానంలోని ప్రాంతాల్లో తూర్పు నుంచి ాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఏర్పడింది.

రాయలసీమలోను రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. వర్షాలు కురిసినా ఎండల ప్రభావం మాత్రం తగ్గదు. వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి ఎప్పటిలాగే ఉక్కపోత మాత్రం తగ్గదని చెబుతున్నారు. దీంతో వర్షాలు మాత్రం ఏపీ వాసులకు ఉపశమనం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
Also Read: రెండు వైపులా కేంద్రంపై కేసీఆర్ పోరు.. టీ బీజేపీ నేతలు ట్రాప్ లో పడుతున్నారా..?