AP Three Capitals Issue:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు విషయాల్లో వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నీ లెక్కలోకి రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. అయినా సీఎం జగన్ మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం తాజాగా మారో జీవో వెనక్కి తీసుకుంది. జీవో నెం.59ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి.
మూడు రాజధానుల వ్యవహారం ప్రజలకు ఇష్టం లేకపోయినా వారి మాటలు పట్టించుకోకుండా చట్టం తీసుకురావాలని చూసింది. కానీ ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి అభాసుపాలైంది. దీనికి తోడు గతంలో మహిళా కార్యదర్శులను కానిస్టేబుళ్లుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టులో చెప్పడంతో జగన్ ప్రభుత్వం జీవోలు ఎందుకు తెస్తుంది? ఎందుకు రద్దు చేసుకుంటుంది అనే సందేహాలు వస్తున్నాయి.
మూడు రాజధానుల విషయంలో ఎవరు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అమరావతి రైతుల ఆందోళన తీవ్రం కావడంతో జీవో వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోమారు ఇంకో జీవో కూడా రద్దు చేసుకోవడంతో ఏపీలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలే సమాధానంగా వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం ససేమిరా అంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: Chandrababu: చంద్రబాబు టీడీపీని కుప్పంలో గట్టెక్కిస్తారా?
రాబోయే ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాలే వెంటాడతాయని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకునేందుకు జగన్ చర్యలు ఉంటున్నాయని తెలుస్తోంది. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి రాబోయే ఎన్నికలు కీలకంగా మారే సూచనలే కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Andhra Pradesh: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?