https://oktelugu.com/

Papikondalu: పర్యాటకులు పాపికొండలకు వెళ్లడం లేదు.. కారణం అదేనా?

Papikondalu:  ఒకప్పుడు పర్యాటకులతో ఆ ప్రాంతం కళకళలాడింది. బోట్లలో ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లేవారు. ఇక ఆ బోటు ఎక్కేందుకు లైన్ ఉండేది. ఆ పర్యాటక ప్రాంతం దాదాపుగా అందరికీ తెలుసు. ఆ ప్రాంతం పాపికొండలు. ప్రముఖమైన ఈ పర్యాటక ప్రాంతానికి ప్రస్తుతం విజిటర్స్ తగ్గిపోయారు. పాపికొండలు టూర్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకులు ఎందుకు ఈ టూర్ పట్ల ఆసక్తి చూపడం లేదు.. పెరిగిన టికెట్ల ధర వల్లనా? లేక గతంలో జరిగిన ప్రమాదాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2021 / 07:26 PM IST
    Follow us on

    Papikondalu:  ఒకప్పుడు పర్యాటకులతో ఆ ప్రాంతం కళకళలాడింది. బోట్లలో ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లేవారు. ఇక ఆ బోటు ఎక్కేందుకు లైన్ ఉండేది. ఆ పర్యాటక ప్రాంతం దాదాపుగా అందరికీ తెలుసు. ఆ ప్రాంతం పాపికొండలు. ప్రముఖమైన ఈ పర్యాటక ప్రాంతానికి ప్రస్తుతం విజిటర్స్ తగ్గిపోయారు. పాపికొండలు టూర్‌కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకులు ఎందుకు ఈ టూర్ పట్ల ఆసక్తి చూపడం లేదు.. పెరిగిన టికెట్ల ధర వల్లనా? లేక గతంలో జరిగిన ప్రమాదాల వల్లనా? ఎందుకు అనే విషయాలపై ఫోకస్..

    Papikondalu

    ఏపీలోని ఫేమస్ పర్యాటక ప్రాంతం పాపికొండలు. గోదావరి నది మధ్యలో ఉండే ఈ సుందరమైన ప్రదేశాన్ని చూడాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. పాపికొండల ప్రాంతానికి వెళ్లే బోట్ వస్తుందంటే చాలు.. అది కిటకిట లాడిపోవాల్సిందే..అనే సీన్ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. జనం అసలు ఆ బోట్ ఎక్కడం లేదు. పాపికొండలు టూర్‌కు రద్దీయే లేదు. పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనకు రాకపోవడానికి కారణం గతంలో ఇక్కడ జరిగిన కచ్చులూరు ప్రమాదం కావొచ్చని కొందరు అంటున్నారు. ఆ ప్రమాదం తర్వాత బోటు చాలా కాలం పాటు నడపలేదు. గత నెల 7న బోటు షికారు స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిన కొద్ది రోజులకు స్పందన బాగానే ఉన్నా ప్రస్తుతం అంతగా లేదు. పర్యాటకులు అరకొరగా వస్తున్నారు.

    వీకెండ్స్ అనగా శని, ఆది వారాల్లో పర్యాటకులు పాపికొండల ప్రాంతానికి వెళ్లేందుకు పోటెత్తేవారు. కానీ, పర్యాటకుల నుంచి ఇప్పుడు ఆ స్పందన లేదు. బోటు షికారుకు అప్పట్లో టికెట్స్ అస్సలు దొరికేవి కాదు. శని, ఆదివారాల్లో 20 నుంచి 25 వరకు బోట్లు తిరిగేవి. సుమారుగా ప్రతీ రోజు రెండు వేల మంది విజిటర్స్ వచ్చే వారు. కానీ, ఈ ఏడు అంత సందడి లేదు. ఇప్పటి వరకు ప్రైవేటు బోట్లపై సుమారు 1,300 మంది, టూరిజం బోట్లపై సుమారు 300 మంది మాత్రమే షికారుకు వెళ్లారు. కచ్చలూరు ప్రమాదంతో పాటు టికెట్స్ ధరలు పెరగడం వల్ల ఇలా జరుగుతున్నదని కొందరు అంటున్నారు.

    Also Read: Sinful Birth: పాపాలతోనే పాడు జన్మలు సంప్రాప్తిస్తాయా?

    ప్రస్తుతం రోజు మొత్తంలో ఒక్కబోటు నిండటమే కష్టమవుతున్నదని బోట్ల నిర్వాహకులు చెప్తున్నారు. అయితే, ఇప్పుడే స్టార్ట్ అయిన నేపథ్యంలో క్రమంగా పర్యాటకులు పెరుగుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దలకు టికెట్ ధర రూ.1,250, పిల్లలకు రూ.1,050. ఈ ధరలో రాజమహేంద్రవరం నుంచి పాపికొండల వరకు ప్రయాణం ఉంటుంది. ఇందులోనే టిఫిన్స్, బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ కూడా అందజేస్తారు. అయితే, గతంలో ఇంత ధర లేదు. గతంలో కేవలం రూ.750 ధర ఉండేది. ప్రజెంట్ పెరిగింది. అయితే, ఇలా టికెట్ కాస్ట్ పెరగడం వల్ల కూడా పర్యాటకులపై ఆర్థిక భారం పడనుంది. కరోనా మహమ్మారి వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. అలా ఇంపాక్ట్ ఉండొచ్చని కొందరు అంటున్నారు.

    Also Read: Parents: పిల్లలు ఫోన్ తరచూ వాడకుండా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే

    Tags