Homeఆంధ్రప్రదేశ్‌AP TDP Mistake: టీడీపీని వెంటాడుతున్న ఆ పెద్ద లోపం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

AP TDP Mistake: టీడీపీని వెంటాడుతున్న ఆ పెద్ద లోపం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

AP TDP Mistake: రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించాలి. ఇక ప్ర‌తిప‌క్షంలో ఉంటే గ‌నక‌.. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండాలి. ప్ర‌భుత్వం చేసే చిన్న మిస్టేక్‌ను కూడా వ‌ద‌ల‌కుండా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి బలంగా ప్ర‌చారం చేయాలి. త‌ద్వారా వ్య‌తిరేక‌త తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా త‌యారయింది.

AP TDP Mistake
Chandra Babu Naidu

అనుకున్న స్థాయిలో పార్టీని చంద్ర‌బాబు చురుగ్గా న‌డిపించలేక‌పోతున్నారు. 2019 ఓట‌మి త‌ర్వాత దిగ్గ‌జ నేత‌లు ఎవ‌రూ కూడా పెద్ద‌గా పెద‌వి విప్ప‌డం లేదు. పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా క‌నిపించ‌ట్లేదు. ఇప్పుడు టీడీపీకి ఇదే పెద్ద మైన‌స్ గా మారిపోయింది. కేడ‌ర్ ఎంత బ‌లంగా ఉన్నా కూడా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో, జిల్లాల్లో పార్టీని బ‌లంగా న‌డిపించే నాయ‌కులు లేక‌పోవ‌డం ఇప్పుడు పెద్ద దెబ్బ‌.

Also Read: Revanth Reddy Hunts KCR: దొడ్డుకర్రలు పట్టుకుని వెంటపడతాం.. కేసీఆర్ మీద రేవంత్ తీవ్ర వ్యాఖ్య‌లు..!

ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త తీసుకురావ‌డానికి టీడీపీ పెద్ద‌గా పోరాడ‌ట్లేదు. ఒక్క రాజ‌ధాని అంశంలో త‌ప్ప ఏ విష‌యాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మంగా మార్చ‌లేక‌పోయింది. టీడీపీ ఏదైనా అంశం మీద విమ‌ర్శిస్తే.. వెంట‌నే వైసీపీ నుంచి నాలుగు కౌంట‌ర్లు వ‌స్తున్నాయి. దాంతో టీడీపీ నేత‌లు చ‌ల్ల‌బ‌డిపోతున్నారు. ఇది కూడా పెద్ద మైన‌స్‌.

AP TDP Mistake
Ayyanna Patrudu

ఇక అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని కూడా కేవ‌లం ఆ ప్రాంతం వ‌ర‌కే ప‌రిమితం చేయ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. కానీ స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పోరాడిన విధంగా చంద్ర‌బాబు గానీ, లోకేష్ గానీ పోరాట ప‌టిమ‌ను చూపించ‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్ స్థాయిలో లోకేష్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోతున్నార‌న్న‌ది వాస్త‌వం.

ఇప్ప‌టికీ టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు చేయాలంటే బుచ్చ‌య్య చౌద‌రి, అయ్య‌న్న పాత్రుడు, అనిత లాంటి వారే క‌నిపిస్తున్నారు. ఒక‌ప్పుడు పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత‌లుగా ఉన్న వారంతా ఇప్ప‌టికీ పార్టీలోనే ఉన్నారు. కానీ వైసీపీ మీద ఎలాంటి విమ‌ర్శ‌లు గుప్పించ‌ట్లేదు. ఇలా నాయ‌క‌త్వ లోపం టీడీపీకి పెద్ద మైన‌స్‌గా మారుతోంద‌ని చెప్పుకోవ‌చ్చు.

Also Read: Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హ‌రీశ్‌రావు.. వీహెచ్‌కు పైస‌లిచ్చిండ‌ట‌..!

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular